వరంగల్, ఆగస్టు 24, (way2newstv.in)
ణాళికలో ఇచ్చిన హామీలను దాదాపుగా ఇప్పటికే ప్రభుత్వం నెరవేర్చింది. ఇక రైతు రుణమాఫీ హామీని కూడా అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. రైతుల రుణాల మాఫీ కోసం బడ్జెట్‌లో ఏ మేరకు కేటాయింపులు చేయాలి? ఎప్పటినుంచి ఉన్న రుణాలను పరిగణనలోకి తీసుకోవాలి? ఎంతమంది రైతులకు వర్తిస్తుంది? అనే దానిపై వ్యవసాయశాఖతోపాటు ఆర్థికశాఖ, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. మాఫీపై ఆశతో పంట రుణాలను రెన్యువల్ చేసుకొనేందుకు రైతులు ముందుకురావడం లేదని గమనించిన ప్రభుత్వం వీలైనంత త్వరగా మొదటివిడుత సొమ్ము కింద బడ్జెట్‌నుంచి కొంత మొత్తంలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.వాస్తవానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనే రుణమాఫీ కోసం 6 వేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం.
రుణమాఫీ దిశగా అడుగులు
2018 డిసెంబర్ 11 వరకు ఉన్న పంటరుణాలను మాఫీ చేయనున్నట్టు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఎప్పటినుంచి.. ఎలా అనే దానిపై మాత్రం మార్గదర్శకాలు విడుదలచేయలేదు. వీటన్నింటిపై బడ్జెట్ సమావేశాల తర్వాతే స్పష్టత రానున్నది. ఇప్పటికే రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సంప్రదించిన ఆర్థికశాఖ.. ఏయే సీజన్లలో ఎక్కువ పంట రుణాలు తీసుకున్నారు, లక్షలోపు ఉన్న రుణాల మొత్తం ఎంత, ఎంతమంది రైతు లు ఉన్నారు అనేదానిపై ప్రాథమిక వివరాలు తెప్పించుకున్నట్టు సమాచారం. ఇందుకనుగుణంగా అమలు మార్గదర్శకాలు, విధివిధానాలు రూపొందిస్తున్నారు. మార్గదర్శకాల విడుదల అనంతరం గ్రామాలవారీగా లబ్ధిదారుల జాబితాను క్రోడీకరించనున్నారు. కుటుంబంలో ఎంతమంది పేరు మీద అప్పు ఉన్నప్పటికీ లక్ష వరకు మాఫీ అవుతుంది. బ్యాంకులు డేటా షేరింగ్ ద్వారా డూప్లికేట్స్ లేకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది.కుటుంబంలో ఒక్కరైతుకే వర్తింపచేయడం, బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకుంటే మాఫీ ఇవ్వాలా? వద్దా? అనే విషయాలపై లోతుగా చర్చిస్తున్నారు. ప్రాథమిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 48 లక్షల మంది రైతులు రుణాలు పొందినవారున్నారు. ఇందులో ఒకలక్ష లోపు రుణాలు 31 వేల 824 కోట్లు ఉన్నట్టు ఎస్సెల్బీసీ వర్గాలు వెల్లడించాయి. 2014లో రుణమాఫీ పథకం అమలు చేసినప్పుడు 17 వేల కోట్లు బకాయిలు ఉండగా.. ప్రభ్తుత్వం వాటిని నాలుగు విడుతలుగా మాఫీ చేసింది. ఇప్పుడు అదే పద్ధతిలో రుణమాఫీ చేయనున్నది.
=
No comments:
Post a Comment