Breaking News

19/08/2019

మ్మిది మందికి డెలివరీ అయిపోయింది

న్యూయార్క్ ఆగస్టు 19 (way2newstv.in - Swamy Naidu)
ఆ ఆసుపత్రిలో వైద్య సేవలందించే 9 మంది నర్సులు ఒకేసారి గర్భవతులయ్యారు. పైగా వారంతా ఒకే రోజు ఒకేసారి తమ బిడ్డలను ప్రసవించడం గమనార్హం. అమెరికాలోని పోలాండ్‌లోని మైనే మెడికల్ సెంటర్‌‌లో పనిచేస్తున్న ఆ తొమ్మిది మంది నర్సులు గత మార్చి నెలలో తామంతా ఒకేసారి గర్భం దాల్చామంటూ పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు వైరలైన సంగతి తెలిసిందే.  నర్సు ఎరిన్ గ్రెనియర్ అనే నర్సు మాట్లాడుతూ.. ‘‘ఒకరి తర్వాత ఒకరం గర్భవతి అయినట్లు చెప్పుకోవడం చాలా కొత్తగా అనిపించింది.
 
మ్మిది మందికి డెలివరీ అయిపోయింది 
బేబీ బంప్ (కడుపు)తో ఒకరినొకరు చూసుకోవడం సంతోషంగా ఉంది. మేం ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం ద్వారా ఏప్రిల్ నుంచి జులై మధ్య నెలలో 9 మంది బిడ్డలకు జన్మనిచ్చాం’’ అని తెలిపింది. ఈ నేపథ్యంలో మార్చి నెలలో హాస్పిటల్ యాజమాన్యం ఈ 9 మంది నర్సులు గర్భంతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. తొమ్మిది మంది నర్సులు బిడ్డలకు జన్మనివ్వడంతో హాస్పిటల్ యాజమాన్యం మరో ఫొటోను పోస్టు చేసింది. ఇందులో 9 మంది నర్సులు తమ బిడ్డలను అందంగా ముస్తాబు చేసి చిరునవ్వులు చిందించడాన్ని చూడవచ్చు. ఆ బిడ్డల వయస్సు 3 రోజులు నుంచి 3 నెలలు ఉంటుందని హాస్పిటల్ వెల్లడించింది. ఏది ఏమైనా ఒకే హాస్పిటల్‌లో పనిచేసే నర్సులు దాదాపు ఒకేసారి గర్భం దాల్చడం చిత్రమే కదూ. 

No comments:

Post a Comment