Breaking News

19/08/2019

గ్రేటర్ లో టిఆర్ ఎస్ నేతల పర్యటన

హైద్రాబాద్, ఆగస్టు 19,  (way2newstv.in - Swamy Naidu)
కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్‌, శంభీపూర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ''దేశంలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తున్నారా? బీజేపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నారా? గతంలో తాగడానికి నీరులేక ప్రజలు ఇబ్బంది పడేవారు. మిషన్‌ భగీరథతో పల్లెలు, పట్టణాల్లో నీటి బాధలు తీర్చాం. షెడ్యూల్‌ ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. 
 గ్రేటర్ లో  టిఆర్ ఎస్ నేతల పర్యటన
జీహెచ్‌ఎంసీలో గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని మంత్రి తలసాని అన్నారు 'ఓపిగ్గా ఉంటే పార్టీలో ఏ పదవులైనా దక్కుతాయి. కేసీఆర్‌ వల్లే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99సీట్లు గెలిచాం. కూకట్‌పల్లి నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తాం. నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు.'అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారని మంత్రి శ్రీనివాస గౌడ్ అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌కు ఎన్నో కంపెనీలు వచ్చాయి. వేలాది మందికి ఉపాధి దొరికింది. ఒక్క సీటు గెలిచిన బీజేపీ తెగ ఎగిసిపడుతుంది. రూ.1500కోట్లతో గుడి కట్టించిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా? టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరిందన్నారురూ.1800 కోట్లతో కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇంజినీర్‌ అవతారం ఎత్తి 3 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తి చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న 22 రాష్ర్టాల్లో కాళేశ్వరం లాంటి ఒక్క ప్రాజక్టైనా కట్టారా? ఏ రాష్ట్రంలోనైనా కల్యాణలక్ష్మీ లాంటి పథకం పెట్టారా? ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికి నీళ్లొస్తున్నాయని మల్లారెడ్డి తెలిపారు

No comments:

Post a Comment