Breaking News

03/08/2019

పటిష్టంగా వాలంటీర్ల వ్యవస్థ

ఒంగోలు, ఆగస్టు 03,(way2newstv.in):
జిల్లా గ్రామ పంచాయితి, వార్డు వాలంటీర్ల వ్వవస్థను పటిష్టంగా  అమలుచేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అదికారులను ఆదేశించారు.   శనివారం స్థానిక ప్రకాశం భవనంలోని కంట్రోల్ రూమ్ లో,డి.ఆర్.డి.ఎ.వెలుగు సమావేశ మందిరంలో జిల్లాలో నూతనంగా ఎంపిక చేసిన వాలంటీర్లకు ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడానికి మండల పరిషత్ అభివృద్ది అధికారులకు, తహశిల్దార్లు, పంచాయితీ రాజ్ విస్తరణ అధికారులు, వెలుగు సిబ్బంది, ఎ,పి.ఎం.లకు రెండు రోజుల శిక్షణా తరగతులు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ  సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లడుతూ  రాష్ట్రంలో ప్రభుత్వ  అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి ముఖ్యమంత్రి నవరత్నాలు కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. 
పటిష్టంగా వాలంటీర్ల వ్యవస్థ

ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం  అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వాలంటీర్లు ద్వారా ప్రజల వద్దకు చేర్చేవిధంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు  చేయడం  జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫర శాఖ ద్వారా అమలుచేస్తున్న ప్రజా పంపిణి వ్యవస్థకు సంబంధించిన నిత్యావసర సరుకులు, పెన్షన్లు, రెషన్ కార్డులు ఇతర రకాల అన్ని సేవలను వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.జిల్లాలో  నూతనంగా ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లకు జిల్లా కేంద్రంలో రెండ్రొజులు పాటు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన మండల పరిషత్  అభివృద్ధి అధికారులు, తహశిల్దార్లు, పంచాయితీ రాజ్ విస్తరణ అధికారులు  మండల స్థాయిలో మూడు రోజులు పాటు వాలంటీర్లకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ పథకాలపై శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.షన్ మాన్, ట్రైని కలెక్టర్ నూరజ్ ధనుంజయ్, బెంగుళూరు కు చెందిన స్వచ్ఛంద సంస్థ మాస్టర్ ట్రైనర్ మురళీధర్ కోటేశ్వరరావు, జిల్లా రెవిన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, జిల్లా పరిషత్ డిస్యూటి సి.ఇ.ఓ సాయికుమారి, మాస్టర్ ట్రైనర్స్ మండల పరిషత్ అభివృద్ధి కారులు సాయికుమార్, రవికుమార్, నాగభూషణం, అజిత, రాజశేఖర్, కృష్ణ , మండల పరిషత్ అభివృద్ది అధికారులు,సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment