Breaking News

03/08/2019

మూసుకుపోయిన మూడో కన్ను (తూర్పుగోదావరి)

కాకినాడ, ఆగస్ట్ 03 (way2newstv.com): 
జిల్లాలో నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నడిరోడ్డుపై హత్యలు..ఆయుధాలతో దాడులకు కొందరు తెగబడుతున్నారు..పకడ్బందీ వ్యూహాలతో నేరాలకు పాల్పడి పరారవుతున్నారు. చిన్నారుల అపహరణలకూ తెగబడుతున్నారు. మహిళల మెడల్లోని గొలుసులను తెంచేస్తున్నారు.. తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. వాహన చోదకులు కొందరు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తుండగా.. మరికొందరు మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి నేరగాళ్ల ఆటకట్టించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు కొన్ని చోట్ల బాగా పనిచేస్తుండగా.. మరికొన్ని చోట్ల ఇవి సరిగా పనిచేయడం లేదు. ఈ పరిణామం నేరాలకు పాల్పడుతున్న వారికి కలిసివస్తోంది. సీసీ కెమెరాల వ్యవస్థ బాగా పనిచేస్తున్న చోట నేరాల కట్టడి సాధ్యమవుతున్నా.. ఇవి సరిగా పనిచేయని ప్రాంతాల్లో కేసులను ఛేదించేందుకు పోలీసులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది.
మూసుకుపోయిన మూడో కన్ను (తూర్పుగోదావరి)

తాజాగా మండపేటలో బాలుడు జషిత్‌ కిడ్నాప్‌ వ్యవహారం నేపథ్యంలో మరోసారి సీసీ కెమెరాల పనితీరు చర్చనీయాంశంగా మారింది. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయం.. రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసు కార్యాలయాల్లో వ్యూహాత్మక స్పందన కేంద్రాలు (స్టాటజిక్‌ రెస్పాన్స్‌ సెంటర్‌) అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ ప్రాజెక్టులో భాగంగా కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నడుస్తోంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనూ కమాండ్‌ కంట్రోల్‌ రూమును ఏర్పాటు చేశారు. ఇదికాక జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో.. అమరావతిలోనూ పర్యవేక్షణ కేంద్రాల ద్వారా సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్వవస్థ నడుస్తోంది. ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయా కేంద్రాలతో అనుసంధానం చేయడంతో వివిధ కేసులు, ప్రమాదాలు, ముఖ్య ఘటనలు చోటుచేసుకున్న సందర్భాల్లో ఆ దృశ్యాలే కీలక ఆధారాల సేకరణకు ఉపకరిస్తున్నాయి. అక్కడి పరిస్థితికి అనుగుణంగా ముందస్తు చర్యలకూ వీలుకలుగుతోంది. ఐటీ కోర్‌ బృందం ఆధ్వర్యంలో ఈ నిఘా వ్యవస్థ పనిచేస్తోంది. ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు కొన్ని చోట్ల బాగా పనిచేస్తుండగా.. మరికొన్ని చోట్ల ఇవి సరిగా పనిచేయడం లేదు. ఈ పరిణామం నేరాలకు పాల్పడుతున్న వారికి కలిసివస్తోంది. సీసీ కెమెరాల వ్యవస్థ బాగా పనిచేస్తున్న చోట నేరాల కట్టడి సాధ్యమవుతున్నా.. ఇవి సరిగా పనిచేయని ప్రాంతాల్లో కేసులను ఛేదించేందుకు పోలీసులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. తాజాగా మండపేటలో బాలుడు జషిత్‌ కిడ్నాప్‌ వ్యవహారం నేపథ్యంలో మరోసారి సీసీ కెమెరాల పనితీరు చర్చనీయాంశంగా మారింది. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయం.. రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసు కార్యాలయాల్లో స్ట్రాటజిక్‌ రెస్పాన్స్‌ సెంటర్‌ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ ప్రాజెక్టులో భాగంగా కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నడుస్తోంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనూ కమాండ్‌ కంట్రోల్‌ రూమును ఏర్పాటు చేశారు. ఇదికాక జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో.. అమరావతిలోనూ పర్యవేక్షణ కేంద్రాల ద్వారా సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్వవస్థ నడుస్తోంది. ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయా కేంద్రాలతో అనుసంధానం చేయడంతో వివిధ కేసులు, ప్రమాదాలు, ముఖ్య ఘటనలు చోటుచేసుకున్న సందర్భాల్లో ఆ దృశ్యాలే కీలక ఆధారాల సేకరణకు ఉపకరిస్తున్నాయి. అక్కడి పరిస్థితికి అనుగుణంగా ముందస్తు చర్యలకూ వీలుకలుగుతోంది. ఐటీ కోర్‌ బృందం ఆధ్వర్యంలో ఈ నిఘా వ్యవస్థ పని చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో నేరుగా అక్కడి దృశ్యాలను నిక్షిప్తం చేసే ఫిక్స్‌డ్‌ కెమెరాలతో పాటు.. 360 డిగ్రీల కోణాల్లోనూ దృశ్యాలను సేకరించే పీటీజెడ్‌ కెమెరాలు.. ముఖాన్ని గుర్తించే సాంకేతికతతో కూడిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ కెమెరాలు.. గుంపులుగా జనం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా పరిశీలించే ఎనలైటిక్స్‌ కెమెరాలు.. వాహనాల సంఖ్యా ఫలకాలను గుర్తించేందుకు ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. రహదారి భద్రత నిబంధనల ఉల్లంఘనులను గుర్తించే నైపుణ్యంతో కూడిన ఆర్‌ఎల్‌వీడీ కెమెరాలూ ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా సంబంధిత కేసుల ఛేదనకు ఈ సాంకేతిక ఉపకరిస్తోంది. దీనికితోడు డయల్‌ 100, మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన శక్తి బృందాలకు అందిన సమాచారం ఆధారంగా నేరాల పరిశోధనకూ ఉపయోగపడుతోంది.జిల్లాలో కిర్లంపూడి, గంగవరం, మామిడికుదురు, కోరుకొండ, రౌతులపూడి, అంబాజీపేట, తొండంగి, వీఆర్‌పురం, ఆత్రేయపురం, కూనవరం తదితర మండలాల్లో నిఘా కెమెరాల వ్యవస్థ అందుబాటులో లేదు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ప్రధాన కూడలిలో కెమెరాలు ఏర్పాటు చేయలేదు. రాజఒమ్మంగిలోని గిరిజన సంక్షేమ బాలికల జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసినా మరెక్కడా వీటి జాడలేదు. పర్యాటక ప్రాంతం మారేడుమిల్లిలో నిఘా కెమెరాల వ్యవస్థ లేదు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ మార్గం మీదుగానే వెళ్లాలి. ఇక్కడ ఏవైనా ప్రమాదాలు జరిగినా.. అసాంఘిక శక్తులు చొరబడినా ఆయా దృశ్యాలను నిక్షిప్తం చేసే వ్యవస్థ లేదు. గంజాయి అక్రమ రవాణా ఇక్కడ జోరుగా సాగుతోంది. గతంలో కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు చేసినా అమలుకు నోచుకోలేదు. రాయవరం మండలంలోని మూడు కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానం కాలేదు. గోకవరం మండలంలోని శివారు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ లేదు. మలికిపురం మండలంలోని విశ్వేశ్వరాయపురంలో మూడేళ్ల కిందట సర్పంచి రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment