Breaking News

12/08/2019

గ్రామాల్లో సోలార్ వెలుగులు

అదిలాబాద్, ఆగస్టు 12, (way2newstv.in)
దళిత, గిరిజనులు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గాలకు సౌరవిద్యుత్ ద్వారా వెలుగులు అందించే బృహత్తర కార్యక్రమానికి తొలి అడుగు పడింది. ఈ పథకానికి శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలి విడతగా రాష్ట్రానికి ఐదు వేల వ్యక్తిగత సౌర విద్యుత్ యూనిట్లు కేటాయించిన కేంద్రం తొలి విడత సబ్సిడీ కింద రూ.12 కోట్లను విడుదల చేసింది. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు విడుదల చేసిన కేంద్ర సాంప్రదాయ, నూతన పునరుద్ధరణీ య విద్యుత్ మంత్రిత్వశాఖ అధికారులు టెం డర్ల ప్రక్రియను పూర్తిచేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలనూ కోరింది. కేంద్ర ఆదేశాలతో తెలంగాణ సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ రెండు నెలల క్రితం టెండర్లు నిర్వహించింది. 
గ్రామాల్లో సోలార్ వెలుగులు

రాష్ట్రాల వాటా కింద విడుదల చేయాల్సిన రాయి తీ నిధులతో పాటు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ను సత్వరం చేపట్టాలని కేంద్ర అధికారులు కోరారు. ‘దీన్‌దయా ళ్ గ్రామ్‌జ్యోతి యోజన’ పథకంలో భాగంగా రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని అర్హులైన దళిత, గిరిజనుల కుటుంబాలకు విద్యుత్ సరఫరా పథకం కొనసాగుతుంది. అర్హులైన లబ్ధిదారులు రూ.125లకు బ్యాంకు డిడి చెల్లిస్తే గృహాలకు అవసరమైన స్తంభాలు, తీగలు అమర్చడంతో పాటు మీటర్, స్విచ్‌బోర్డు, ఎర్తింగ్, ఒక బల్బుకు విద్యుత్ సరఫరా చేస్తారు. ఇప్పటి కే ఈ పథకం కింద ఎంపికై పనులు దక్కించుకున్న ఏజెన్సీలు యుద్ధప్రాతిపదికన పనులను పరుగులు పెట్టిస్తున్నాయి. అదనంగా కేంద్రం ప్రకటించిన సౌరవిద్యుత్ పథకం కింద ప్రాథమికంగా దళిత, గిరిజన వర్గాలు, ఆపై దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అర్హులను రాష్ట్ర అధికారులు దీని పరిధిలోకి చేరుస్తున్నారు. ఇప్పటికే నిబంధనలు, విధివిధానాలు ఖరారు కాగా టెండర్లు ఫైనల్ అయితే ఐదువేల మందికి నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. దేశవ్యాప్తంగా ఒక లక్ష దళిత, గిరిజన కుటుంబాల్లో సౌరవిద్యుత్ వెలుగులు నింపాలన్న లక్షంతో కేంద్రం చేపట్టిన ఈ పథకం కింద తెలంగాణకు మొదటి విడత కింద ఐదువేల యూనిట్లు మంజూరయ్యాయి. నిర్ణీత వ్యవధిలోగా వీటిని పూర్తిచేస్తే అదనంగా మరికొన్ని యూనిట్లు లభించే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, కరీంనగర్ పూర్వజిల్లాల్లోని చెంచు ఆవాసాలు, ఆదివాసీ గూడెలు, గిరిజన తండాలల్లోని దారిద్ర రేఖ దిగువన ఉన్న నిరుపేదలకు లబ్ధి చేకూరనుంది. నాలుగేళ్ల క్రితం చేపట్టిన సౌరవిద్యుత్ పంపుసెట్ల టెండర్ తతంగం అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 4.90 లక్షల యూనిట్ ధరతో కేంద్రం మంజూరు చేసిన రెండు వేల వ్యవసాయ పంపుసెట్ల టెండర్ల ప్రక్రియను దాట లేకపోయింది. ఈ యూనిట్‌లో సోలార్ ప్యానెల్, బోరుబావి లోపల ఉండే సబ్‌మెర్సిబుల్ పంపుసెట్ తదితరాలు ఉంటాయి. యూనిట్‌ను సరఫరా చేసిన తర్వాత రెండేళ్ళ పాటు వీటిని సరఫరా చేసిన ఏజెన్సీ సర్వీసును అందించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు పోటీపడిన పలు రాష్ట్రాలు మొదటి ప్రాధాన్యత క్రమంలో కేటాయించిన లక్షాలను పూర్తిచేయడమే కాకుండా రెండవ, మూడవ విడతలలోను అదనపు యూనిట్లను సాధించుకున్నాయి. 

No comments:

Post a Comment