Breaking News

12/08/2019

భక్తీ శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

కౌతలం  ఆగస్టు,12  (way2newstv.in)
మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ముస్లీం సోదరులు భక్తీ శ్రద్ధలతో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముస్లీం సోదరులు కొత్త బట్టలతో, అత్తరు పూసుకొని మసీదు ను చేరుకొని అక్కడి నుంచి భక్తి గీతాలతో ఇద్గాను చేరుకున్నారు. మోలీ సాహెబ్, ఇమామ్ సాహెబ్ ప్రత్యేక ప్రార్థనలు, ఫతేహలు నిర్వహించారు. ఇమామ్ సాహెబ్ మాట్లాడుతూ. బక్రీద్ పండుగ ముస్లీం సోదరుల త్యాగానికి ప్రతిఫలం అని ప్రతి ఒక్కరు ముస్లీం సోదరులు ఆ భగవంతునికి కుర్బాని ఇవ్వాలని కోరారు. మహమ్మదీయుల కాలం క్యాలెండర్ ప్రకారం  బక్రీద్ పండుగ వస్తుంది. పదవ రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ఇస్లాం సూత్రాలు.  
భక్తీ శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు 

త్యాగనిరతి తో పాటు మనో వాంఛ స్వార్థం అసూయ రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవత్వం అనేది బక్రీద్ పండుగ తెలిపారు. ఖురాన్ ప్రకారం భూమిపైకి పంపిన ప్రవక్తలలో ఇబ్రహీం ఒకరు ఆయన పట్టణాన్ని నిర్మించి నివాసయోగ్యంగా మార్చారు. అల్లాహ్ ఆరాధన కోసం కాబా ప్రార్థన మందిరం కూడా నిర్మించి దైవ ప్రవక్త ఆయన పేరు గాంచారు. ఇబ్రహీం  తనకు లేక లేక పుట్టిన బిడ్డకు  ఇస్మాయిల్ అని పేరు పెట్టారు. ఒకరోజు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోస్తున్నట్టు ఇబ్రహీం కలగన్నాడు. దైవ ప్రవక్త కుర్భాని కోరుతున్నారని ఒక ఒంటెను బలిస్తాడు. అయినా మళ్లీ అదే కల రావడంతో తన కుమారుడిని బలిదానం కోరుకుంటున్నారని  భావించిన ఇస్మాయిల్ సిద్ధపడ్డాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబహ్ కు ఇబ్రహీం సిద్దమవుతున్న సమయంలో అతని త్యాగానికి మెచ్చి న అల్లాహ్ దీనికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రయీల్ అనే దూత ద్వారా కోరుతాడు. అప్పటి నుంచి బక్రీద్ రోజున కుర్బాని ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది ముస్లింలు భావిస్తున్నారు. కుర్బాని అంటే పేదలకు మాంసం దానమివ్వడం  త్యాగం అనే అర్థాలు ఉన్నాయని ఇమామ్ సాహెబ్ పేర్కొన్నారు.అనంతరం ప్రత్యేక ఫతేహలు నిర్వహించి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒకరి నొకరు ఆలింగనం చేసుకుని ఇద్ ముభారక్ లు చెప్పుకున్నారు. బారి సంఖ్యలో ముస్లీం సోదరులు ఈద్గా కు తరలి వచ్చి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇమామ్ సాహెబ్ సద్దాం హుస్సేన్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గలటలు చెరగకుండ  ఈద్గా వద్ద పోలీస్ బంద్ భస్తు నిర్వహించారు.

No comments:

Post a Comment