Breaking News

23/08/2019

ప్రకాశం పంతులు సేవలు గర్వించదగినవి

ఒంగోలు, ఆగస్టు 23, (way2newstv.in  - Swamy Naidu):
శుక్రవారం ఒంగోలు మండలం  దేవరంపాడులోని ఉప్పు సత్యాగ్రహం విజయ స్థూపం దగ్గర టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్,  జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  పాల్గొన్నరాష్ట్ర అటవి, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, విద్యుత్ శాఖా మంత్రి  బాలినేని శ్రీనివాసరేడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటీష్  వారికి గుండెలు చూపించి ఎరురు నిలిచిన మహావ్యక్తి ప్రకాశం పంతులు అన్నారు. ప్రకాశం పంతులు ప్రకాశం  జిల్లా వినోదరాయుని వారి పాల్లెం గ్రామంలో జన్మించి రాష్ట్రం గర్వించే విధంగా ప్రజలకు సేవలందించారన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఆయన అన్నారు. 
ప్రకాశం పంతులు సేవలు గర్వించదగినవి
జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 1 లక్షా  50 వేల  మందికి గ్రామ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి  చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో రామతీర్ధం జలాశయాన్ని, ఉలిచి చెక్ డ్యామ్ ను నిర్మించి త్రాగు నీరు, సాగునీరు అందించామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందించడానికి ఉలిచి చెక్ డ్వామ్ ఎత్తును పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే దేవరంపాడు నుండి విజయ స్థూపం వరకు సిమెంటు రోడ్లు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో మద్రాసులో జరిగిన సైమన్ కమీషన్ ను వ్యతిరేకిస్తూ అనేక ధర్నాలు చేపట్టారన్నారు. సైమన్ గోబ్యాక్ అంటూ బ్రిటీష్ వారిని గుండె చూపి ఆంధ్రకేసరి గా నిలబడ్డారన్నారు. దేశం కోసం ప్రకాశం పంతులు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రజలకు స్పూర్తిగా నిలిచారన్నారు. రాష్ట్రంలో జమిందారి వ్యవస్థకు చమరగాతం పాడి రైతులకు భూమి హక్కును కల్పించారన్నారు. రెవిన్యూ మంత్రిగా సనిచేసి అనేక సంస్కరణలు చేప్పట్టారన్నారు.  ఈ సంవత్సరం నుండి ఒంగోల్ లోనే తరగతులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. త్రిబుల్ ఐటి కళాశాలను జిల్లాలో త్వరలో నిర్మించడానికి చర్యలు  తీసుకుంటామని ఆయన అన్నారు. దేవరసాడులో శిధిలావస్థలో గ్రంధాలయాన్ని తొలంగించి దాని స్థానంలో విద్యాశాఖ ద్వారా వచ్చే సంవత్సరం నాటికి క్రొత్త భవనాన్ని నిర్మిస్తామని ఆయన అన్నారు. జిల్లాలో రామయపట్సం ఓడరేవు, దొనకొండ పిరిశ్రమిక కారిడార్, కనిగిరి నిమ్జ్ పరిశ్రమలను ప్రనాళిక ప్రకారం పూర్తిచేస్తామని ఆయన అన్నారు.  జిల్లా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ టంగూటురి ప్రకాశం  పంతులు స్వాతంత్రం ఉద్యమంలో విశేష  పాత్ర పోషించి  ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారన్నరారు.  ప్రకాశం జిల్లాలో  జన్మించి రాష్ట్రానికి ఎనలేని  సేవలందించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  సంతనూతలపాడు శాసనసభ్యులు  టి.జె.ఆర్.సుధాకర్ బాబు, మద్ది శెట్టి వేణుగోసాల్, షన్ మోహన్, ట్రైని  కలెక్టర్ సూరాజ్ ధనుంజయ్, సర్వశిక్షా  అభియాన్  ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వరరావు,  జిల్లా విద్యాశాఖాధికారి  సుబ్బారావు, డ్వామా పి.డి. వెంకటేశ్వర్లు, ఒంగోలు తహశిల్దార్ చిరంజివి, ఎమ్.పి.డి.ఓ.పి.వి.నారాయణ, ఘనశ్యం, మద్దిపాడు మార్కెట్ యార్డ్  మాజీ అధ్యక్షులు మారం వెంకారెడ్డి, దేవరంపాడు, బొద్దులూరి వారిపాల్లెం,  ఉలిచా, కరువది, పాతపాడు, గుండాయపాలెంకు చెందిన నాయకులు ప్రజలు పాల్గొన్నారు.    

No comments:

Post a Comment