Breaking News

23/08/2019

సేవకు మారు పేరు సత్యసాయి ట్రస్ట్ - సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి ఆగస్టు 23 (way2newstv.in - Swamy Naidu):
సేవకు మారు పేరు సత్యసాయి ట్రస్ట్ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.   పెద్దపల్లి జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సత్యసాయి ట్రస్ట్ వారు ఎర్పాటు చేసిన నిత్యానందన  కార్యక్రమం మొదటి వార్షికోత్సవం సందర్బంగా  మంత్రి ముఖ్య అతిథిగా హాజరై  జ్యోతి ప్రజ్వలన చేసి  కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతర మంత్రి మాట్లాడుతూ  ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యం కొరకు వచ్చే పేద  రోగులకు మరియు వారి కుటుంబసభ్యులకు  ఉచితంగా భోజనం అందించే దిశగా   గత సంవత్సరం ప్రారంభించి విజయవంతంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం అని కొనియాడ్డారు .  సంవత్సర కాలంలో సత్యసాయి ట్రస్ట్ వారు సమారు 12500 మందికి అన్నదానం నిర్వహించారని , రాష్ట్ర వ్యాప్తంగా సైతం సత్యసాయి ట్రస్ట్ వారు 18 ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిత్యాన్నదాన  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు.  సత్యసాయి ట్రస్ట్ లో పనిచేసే వారు చాలా నిబద్దతో  సేవా తత్వంతో విధులు నిర్వహిస్తారని మంత్రి ప్రశంసించారు.  

సేవకు మారు పేరు సత్యసాయి ట్రస్ట్ - సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్
రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహించిన గోదావరి పుష్కరాల సమయంలో   ప్రతి రోజు ధర్మపురి పుణ్యక్షేత్రానికి కొని లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి వచ్చేవారని, వారందరికి ప్రభుత్వం  సౌకర్యాలు కల్పించడం కష్టంగా ఉండేదని, అలాంటి సమయంలో అనేక సేవా సంస్థలు స్వచ్చందంగా ముందుకు   వచ్చి  అన్నదాన  కార్యక్రమాలు నిర్వహించారని, అందులో  సత్యసాయి సేవ సంస్థ వారు సైతం ఉన్నారని తెలిపారు.   సిద్దిపేటకు చెందిన అమర్ నాథ్  అన్నధానం సత్రం వారు ప్రతి రోజు 25 వేల మందికి భోజనం అందించేవారని,  ఒక సారిరోడ్ల పై భారీ ఎత్తున ట్రాఫీక్ జాం అయిన సమయంలొ ముఖ్యమంత్రిగారు  రోడ్ల పై వెచ్చి ఉన్న భక్తులకు సైతం భోజనం అందించేందుకు ఎర్పాటు చేయవలసిందిగా ఆదేశించిన సమయంలో అనేక మంది  రాత్రి సమయంలో సైతం  అలసిపోకుండా ఉత్తేజంతో  పనిచేసి వారికి భోజనం అందించారని మంత్రి గుర్తు చేసారు.  సత్యసాయి ట్రస్ట్ వారు వారి సేవలను మరింత విస్తృతంగా కొనసాగించాలని,  ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని, ఆ దిశగా సత్యసాయి భగవాన్ వారు స్పూర్తి కల్పించాలని   మంత్రి ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గోన్న  జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పుట్ట  మధు మాట్లాడుతూ  ప్రస్తుత సమాజంలో భోజనానికి కొన్నీ చోట్ల  విలువ లేకుండా పొతుందని,  మన ఫంక్షన్ లలో  అధిక శాతం భోజనం వృథా చేస్తున్నామని, అదే  సమయంలో కొన్ని ప్రదేశాలో  మనుషులకు ఆకలితో భాధపడుతున్నారని  తెలిపారు.  సంవత్సర  కాలం పాటు పెద్దపల్లి ప్రబుత్వ ఆసుపత్రి నందు నిత్యానదానం  కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయంమని,  మహదేవపూర్ మండలంలొని  ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సైతం  ఇలాంటి  కార్యక్రమం నిర్వహించడానికి తాము సంకల్పించామని,  అప్పుడు ఎన్నికల వచ్చిన దృష్ట్యా  ఆ కార్యక్రమం ముందుకు సాగలేదని, ఈ కార్యక్రమం  స్పూర్తితో భగవంతున్ని ఆశీసులతో  త్వరలో మంథని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సైతం   ఇలాంటి  కార్యక్రమం నిర్వహించేందుకు కృషి చేస్తామని  తెలిపారు.కార్యక్రమంలో పాల్గోన్న  పెద్దపల్లి శాసనసభ్యులు దాసరిమనోహర్ రెడ్డి మాట్లాడుతూ   పేద రోగులకు మరియు  వారితో ఉండే సహయకులకు భోజనం అందించాలనే మంచి ఆలోచన రావడం చాలా మంచి విషయమని తెలిపారు.  సేమ ప్రేమ అని బాబా అందించిన  సందేశంతో వారి భక్తులు ముందుకు సాగడం మంచి విషయమని, ఇలాంటి మంచి  కార్యక్రమాలకు తమ సహయం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. అనంతరం  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  సత్యసాయి నిత్యానదాన  కార్యక్రమంలో సేవలు అందిస్తున్న  సేవకులను శాలువాలతో సత్కరించారు.జిల్లా జాయిట్ కలెక్టర్ వనజాదేవి, డిసిపి సుదర్శన్ గౌడ్,  సత్యసాయి సెవా సంస్థ  అధ్యక్షులు  వెంకటరావు,  పెద్దపల్లి సత్యసాయి సేవా సంస్థ అధ్యక్షులు  వెంకటస్వామి,  సంబంధిత అధికారులు, సత్యసాయి భక్తులు , తదితరులు ఈ  కార్యక్రమంలో  పాల్గోన్నారు.

No comments:

Post a Comment