Breaking News

05/08/2019

తిరస్కరణకు గురైన ప్రజలకు ప్రయోజనం చేకూరేలా అభివృద్ధి పనులు

రాజమహేంద్రవరం ఆగష్టు 5  (way2newstv.com - Swamy Naidu)
నగరపాలక సంస్థ కమిషనర్‌ సుమిత్‌ కుమార్‌ ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా నగరంలోని ఆయా డివిజన్ల ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించి స్థానిక ప్రజల ఇబ్బందలను దూరం చేయాలని ఈ సందర్భంగా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. 41వ డివిజన్‌లోని పార్కులో ఓపెన్‌ జిమ్‌ సామాగ్రి, పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని, అలాగే టెండర్లు పిలిచి మధ్యలో నిలిచిపోయిన, స్థాయి సంఘం దృష్టికి తీసుకువెళ్లి తిరస్కరణకు గురైన ప్రజలకు ప్రయోజనం చేకూరే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.
తిరస్కరణకు గురైన ప్రజలకు ప్రయోజనం చేకూరేలా అభివృద్ధి పనులు
అలాగే 42వ డివిజన్‌లో డ్రైనేజ్‌లు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, అదే డివిజన్‌లోని రత్నంపేటలోని వాంబే గృహాల వెనుక గోడ ఎత్తును నాలుగు అడుగులకు పెంచాలని కోరారు. అలాగే 13వ డివిజన్‌లో డైమాండ్‌ పార్కును అభివృద్ధి చేసి, పార్కులో ఓపెన్‌ జిమ్‌ సామాగ్రి ఏర్పాటు చేయాలన్నారు. 5వ డివిజన్‌లోని సబ్‌ కలెక్టర్‌ బంగ్లా ఎదురు... ఎస్‌కెవిటీ డిగ్రీ కళాశాల వెనుక రోడ్డులో కొద్ది పాటి వర్షానికే వర్షం నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, దాని వల్ల స్థానిక ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే అదే రోడ్డులో కొంతమంది మద్యం సేవించి అటుగా వెళ్లే యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, మందు బాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆ రోడ్డులో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 22వ డివిజన్‌లో నెలకొన్న సమస్యల కారణంగా ప్రజలు ఆగచాట్లు పడుతున్నారని, వాటిని పరిష్కరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ  రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, మర్రి దుర్గా శ్రీనివాస్‌, నాయకులు బుడ్డిగ గోపాలకృష్ణ, మళ్ల వెంకటరాజు కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

No comments:

Post a Comment