అదిలాబాద్, ఆగస్టు 27, (way2newstv.in)
రిమ్స్ నిర్వహణ తీరు బాగాలేని కారణంగా వైద్య కళాశాల గుర్తింపును ఎంసీఐ నిరాకరించటంతో వాటిని సరిదిద్దుకునేందుకు రిమ్స్ యాజమాన్యం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అయిదేళ్లకొకమారు వైద్య కళాశాలను ఎంసీఐ(భారత వైద్య మండలి) తనిఖీలు నిర్వహించి నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉంటేనే గుర్తింపును కొనసాగిస్తుంది. గత జూన్‌లో రిమ్స్‌ను పరిశీలించిన ఆ మండలి రిమ్స్‌లో పలు లొసుగులు ఉన్నట్లు గుర్తించి గుర్తింపు కొనసాగింపును నిరాకరిస్తున్నట్లు, నెల రోజుల్లో లోపాలను సరిదిద్దుకోవాలని స్పష్టం చేసింది. ఈ సంస్థలో ఉన్న లోపాల గురించి ‘ఈనాడు’లోనూ వరస కథనాలు ప్రచురితం అయ్యాయి.
నష్టనివారణ చర్యల్లో రిమ్స్
దీంతో స్పందించిన జిల్లా పాలనాధికారి రిమ్స్‌ను ప్రక్షాళన చేయటానికి చర్యలు ప్రారంభించారుఎంసీఐ ఇచ్చిన నెల రోజుల గడవులోపు లోపాలను సరిదిద్దుకోవటానికి యాజమాన్యం ఉపక్రమించింది. ప్రధాన లోపం అధ్యాపకుల కొరతగా ఎంసీఐ పేర్కొంది. ఈ కొరతను పూరించటానికి అధ్యాపకుల భర్తీకి యాజమాన్యం ప్రకటన జారీ చేసింది. ఇందులో 14 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఆరుగురు ట్యూటర్లను ఒప్పంద ప్రాతిపదికన నియమించుకోవటానికి ప్రకటన చేశారు.బోధన సిబ్బందిలో 35.84 శాతం, ట్యూటర్ పోస్టుల్లో 80 శాతం ఖాళీలు ఉండటం రిమ్స్ ప్రారంభం నుంచి ఆధ్యాపకుల కొరత వెంటాడుతూనే ఉంది. మంత్రులు, అధికారులు సైతం పలు మార్లు రిమ్స్‌ను సందర్శించి వైద్యుల నియామకం చేస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప ఆ దిశలో కృషి చేయటంలో విఫలం కావటం వల్ల ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. డాక్టర్ అశోక్‌్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తూ మెడికల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ సంస్థకు సంచాలకుడిగా ఉన్నారు. డాక్టర్ అశోక్ సంచాలకుడి పోస్టుకు అనర్హుడనే ఆరోపణలు ఉన్నాయి. రెండు పోస్టులు ఒక్కరే నిర్వహించటం పట్ల ఆసుపత్రి వైద్య వర్గాలతో పాటు బయటి వారు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రెసిడెంట్ వైద్యుల కొరత 80.64 శాతం ఉన్నారు. ఎంసీఐ నిబంధనల మేరకు రెసిడెంట్ వైద్యులు ఉండాలి. అధ్యాపకుల కొరత కేవలం పది శాతం మాత్రమే ఉంటే ఆ బృందం వెసులుబాటును ఇస్తుంది. కాని రెసిడెంట్ వైద్యులు ఇక్కడ పని చేయకుండా ఆటంకాలు సృష్టించటం వల్లనే ఈ పరిస్థితి నెలకొందనే వాదనలున్నాయి.
No comments:
Post a Comment