Breaking News

12/08/2019

మీడియా చర్చలకు కేసీఆర్ మార్క్

హైద్రాబాద్, ఆగస్టు 12, (way2newstv.in
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలిసిన మిడియా నేడు రాజకీయ పార్టీల అజెండాలకు జండాలు మోస్తుంది. దాంతో ఏ ఛానెల్ ఏ పార్టీ, ఏ పత్రిక ఎవరికి భజన చేస్తుంది అన్నది స్పష్టం అయిపొయింది. ఈ వ్యవహారంపై క్లారిటీ వున్నా దృశ్యమాధ్యమాలు  నిర్వహించే చర్చలు ప్రధాన రాజకీయ పార్టీలకు లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. పార్టీ వాదన సమర్ధవంతంగా వినిపించేందుకు ఆయా పార్టీల నుంచి హాజరయ్యే ప్రతినిధులు చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి లాభం కన్నా నష్టం ఎక్కువ చేకూరుస్తున్నాయి. దీనికి తోడు చర్చలకు ఎంచుకునే అంశాలు అధికారపార్టీలను లక్ష్యంగా చేసుకునే ఉంటాయి.చర్చల్లో నలుగురు ఒకవైపు ఉంటే ఒక్కరే పోరాడినా వాదన వీగిపోతుంది. 
మీడియా చర్చలకు కేసీఆర్ మార్క్

దీనికి తోడు ఒక ఛానెల్ లో వినిపించిన వాదనకు మరొచనెల్ లో అదే అంశంపై జరిగిన చర్చలో పార్టీ వాదన భిన్నంగా మరోప్రతినిధి వినిపించడం లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఇవన్నీ బేరీజు వేసుకున్న తెలంగాణ రాష్ట్రసమితి టివి చర్చలకు గులాబీ ప్రతినిధులను పంపకుండా అనధికార నిషేధం విధించింది. దాంతో ప్రధానమైన అధికారపార్టీ ప్రతినిధులు లేకుండా చప్పగా నడుస్తున్నాయి చర్చలు. అయితే పార్టీ ఆదేశాలు ధిక్కరించి టివిల్లో వ్యక్తిగత మైలేజ్ కోసం పాల్గొంటే వారికి వేటు తప్పదని సంకేతాలు రావడంతో మైక్ చూస్తే అల్లాడిపోయే పార్టీ ప్రతినిధులు మౌనాన్ని ఆశ్రయించాలిసి వచ్చింది.అలా అని ఏ ప్రతినిధి పార్టీ నుంచి లేకుండా తమ వాదన వినిపించకపోతే మరింత మైనస్ అని గులాబీ పార్టీ గుర్తించిందని కారు పార్టీ లో టాక్ నడుస్తుంది. అందుకే 30 మంది అధికార ప్రతినిధులను ఎంపిక చేసి వారినే చర్చలకు పంపేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అది పూర్తి అయ్యి లిస్ట్ బయటకు వస్తే కానీ మళ్ళీ టివి చర్చల్లో గులాబీ ప్రతినిధులకు ఛాన్స్ లేదు. దాంతో ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకుంది. అధిష్టానం రూపొందించే లిస్ట్ లో తమ పేరు ఉంటుందో లేదో అని బెంగ పెట్టుకున్నారు గులాబీ లీడర్లు. లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

No comments:

Post a Comment