Breaking News

16/08/2019

మత్స్య కార్మికుల అభ్యున్నతికి చేపల పెంపకం

వరంగల్ అర్బన్, ఆగస్టు 16, (way2newstv.in):
మత్స్య కార్మికుల అభ్యున్నతికి  కాళేశ్వరం, దేవాదుల ఎత్తిపోతల పథకాలతో నిండుతున్న చెరువులు, రిజర్వాయర్లలో  చేపల పెంపకాన్ని ప్రభుత్వం  ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ త్రాగునీటి సరఫరా శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లాల్లో  ఈ యేడాదికి ప్రభుత్వం నిర్ధేశించిన కార్యాచరణ ప్రణాళిక అమలుకు చెరువులు, రిజర్వాయర్లలో చేపల పెంపకం కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ పాటు ఎమ్మెల్యేలు  ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య హజరయ్యారు. ముదిరాజ్, బెస్త కార్మికుల బతుకులను మార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మెదటి దశలో 89 కోట్ల చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు.  అందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఒక కోటి 50 లక్షల చేప పిల్లలను విడుస్తున్నట్లు తెలిపారు.
మత్స్య కార్మికుల అభ్యున్నతికి చేపల పెంపకం

ఈ సందర్భంగా మత్స్యాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలం పాటు నిర్లక్ష్యానికి  గురైన బి.సి. వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం అండాగా నిలుస్తున్నట్లు తెలిపారు. గతంలో  చెరువులు నిండినప్పటికి డబ్బులు పెట్టి చేప పిల్లలను కొనితెచ్చి, పెంచే స్తోమత లేనందున మత్స్యకారులు కూలీలుగానే బ్రతికేవారని పేర్కొన్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న ఆంద్ర కాంట్రాక్టర్లు మన చేపల చెరువులను అక్రమ పద్దతిలో స్వాధీనం చేసుకొని కోట్లాది రూపాయలు ఆర్జించారని తెలిపారు. అయితే తెలంగణ ఏర్పడిన అనంతరం కుల వృత్తులపై ముఖ్యమంత్రి  ప్రత్యేక దృష్టి  సారించినట్లు తెలిపారు. అందులో భాగంగా చెరువుల పునరుద్ధరణతో పాటు ప్రాజెక్టుల నీటితో నింపుతేన్నట్లు తెలిపారు. మత్య్సకారులు ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నూరు శాతం సబ్సిడీపై చేప పిల్లలను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు పెంపకానికి, మార్కెటింగ్ ను ప్రభుత్వం ప్రోత్సమిస్తున్నట్లు తెలిపారునాణ్యత లేని  చేప పిల్లలను తిరస్కరించాలని మత్య్ససహకార సంఘాలకు సూచించారు. అక్కరకురాని చేప పిల్లలను తీసుకోవడం వలన మత్య్సకార్మికులకు నష్టం జరుగుతుందని తెలిపారు. మార్చి వరకు సక్రమంగా పెంచుకుంటే మంచి ఆదాయం  అభిస్తుందని తెలిపారు. మరో నాలుగు  నెలల్లో దేవాదుల ప్రాజెక్టు పనులు శాతం పూర్తవుతాయని  తెలిపారు. దేవాదుల నీటిని పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకే కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి  కె.సి.ఆర్. తెలిపారని  చెప్పారు. తద్వారా 365 రోజులు ఎత్తిపోసే గోదావరి నీటితో స్టేషన్ ఘన్ పూర్ నియెజకవర్గంలోని  8 రిజర్వాయర్లును, అన్ని చెరువులను ఎండాకాలంలో కూడా నిండుగా నింపనున్నట్లు తెలిపారు. జలాశయాలు కళకళలాడిదే మత్య్స  సంపద పెరిగి ముదిరాజ్, బెస్త కార్మికుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు.   ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రకటించిన 60 రోజుల కార్యక్రమాన్ని విజయయవంతం చేయాలని గ్రామ పంచాయితీ సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు. గ్రామాలను హరితమయం చేసేందుకు పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టాలని కోరారు. గ్రామాలను పచ్చదనం-పరిశుభ్రతకు నిలయాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి  సహయనిథి నుండి అర్ధిక సహాయంగా మంజూరు అయిన రూ.43 వేలను అబ్ధిదారుడు వెంకటస్వామికి, రూ.44 వేలను లబ్ధిదారు బాలామణికి మంత్రి పంపిణీ చేశారు.

No comments:

Post a Comment