Breaking News

19/08/2019

విధి నిర్వహానలో అలసత్వం తగదు

ఏలూరు, ఆగష్టు 19 (way2newstv.in - Swamy Naidu)
మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా సక్రమంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్  రేవు ముత్యాలరాజు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మండల ప్రత్యేక అధికారులతో లాప్టాప్ లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల పనితీరునుబట్టి వారికి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. స్పందన, నేరుగా వచ్చిన అర్జీల పరిష్కరించిన తీరు, క్షేత్రస్థాయిలో పర్యటనలు, తనిఖీలు, తీసుకున్న చర్యలు తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందన్నారు. తనిఖీల సందర్భంగా గుర్తించిన సమస్యలు వాటిపై సకాలంలో అందించిన నివేదికలు, వాటిపరిష్కారానికి తీసుకున్న చర్యలను పరిశీలించడం జరుగుతుందన్నారు. 
విధి నిర్వహానలో అలసత్వం తగదు
అంతేకాకుండా సమస్యల పరిష్కారంలో నిధులకు సంబంధింలేని వాటిని గుర్తించి వాటి పరిష్కారానికి వెనువెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలని, ఆర్థిక, నిధులతో సంబంధంవున్న సమస్యలను నివేదిక సమర్పిస్తూ అనుమతులు పొందాలన్నారు. ఆర్థిక అనుమతులు పొందిన వాటిలో ఎన్ని సమస్యలు పరిష్కారం అయిందీ, పరిష్కరించకపోతే ఎందువల్ల పెండింగ్ లో వున్నదీ వివరాలు అందచేయాలని అదికారులను కలెక్టర్ ఆదేశించారు. పనుల నిర్వహణలో అవసరమైన సూచనలు, సలహాలను కూడా మండల ప్రత్యేక అధికారులు ఇవ్వవచ్చునని, అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీచేయడం జరుగుతుందన్నారు. క్రిందిస్థాయి సిబ్బంది సక్రమం గా విధులు నిర్వహించేలా అధికారులు చర్యలుతీసుకోవాలన్నారు. విధులు నిర్వర్తించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపే తగు చర్యలు తీసుకుని పనులు జాప్యం లేకుండా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఎటువంటి అనుమతి లేకుండా స్వంతపనులపై జిల్లా దాటి వెళ్లేవారిని ఉపేక్షించబోనని చెప్పారు. 

No comments:

Post a Comment