Breaking News

06/08/2019

ప్రజాక్షేత్రంలోకి కేటీఆర్

హైద్రాబాద్, ఆగస్టు 6  (way2newstv.in - Swamy Naidu)
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సీతాఫల్ మండిలోని జీహెచ్ ఎంసీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, నగరంలో చేసిన అభివృద్ధి అంశాలను వివరించారు.ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. సభ్యత్వాల నమోదులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేతలు వెనుకబడడంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. జులై, 2019 ప్రారంభంలో మొదలైన సభ్యత్వ నమోదు విషయంలో పార్టీ నేతలు శ్రద్ధ పెట్టలేదనే ఆగ్రహంతో కేటీఆర్ ఉన్నారు.
 ప్రజాక్షేత్రంలోకి కేటీఆర్
పార్టీ నేతల మధ్య సమన్వయం లోపం ఈ పరిస్థితికి కారణమని ఆయన భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సిటీలో పార్టీకి నష్టం తప్పదని తానే ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావుతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు మరో ఏడాదిన్నర తర్వాత జరగాలి. అయితే ముందస్తు ఎన్నికలు కూడా జరుగవచ్చనే అభిప్రాయంలో పార్టీ నేతలు ఉన్నారు. ఇదే విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గతంలో కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సన్నద్ధంగా ఉండే విధంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకే కేటీఆర్ ఇప్పటి నుంచి దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఏకంగా 100 మంది కార్పొరేటర్లను గెలుచుకుంది. కాంగ్రెస్, బీజేపీ లు ఖాతా కూడా తెరవలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ కలిపి 8 సీట్లు గెలుచుకుంటే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్ ఎస్ 16 సీట్లు గెలుచుకుంది.

No comments:

Post a Comment