Breaking News

06/08/2019

45 లక్షల ఎకరాలకు నీరు

కరీంనగర్, ఆగస్టు 6  (way2newstv.in - Swamy  Naidu )
తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తయినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఈ రోజు సీఎం పర్యటించారు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువన 150 కిలోమీటర్ల మేర నీరు నిలువ ఉండటాన్ని ఎరియల్ వ్యూ ద్వారా సీఎం చూశారు. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలపై కాలినడకన తిరిగి పరిశీలించారు. ప్రాణహిత నుంచి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వస్తున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, పారిశ్రామిక అవసరాలు సహా 80శాతం తెలంగాణకు తాగునీటిని అందించే కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తయినందుకు సంతోషంగా ఉందన్నారు.ఈ సీజన్‌లో మేడిగడ్డ నుంచి కిందకు ఎంత వరద వెళ్లిందని సీఎం ఆరా తీశారు. 300 టీఎంసీల నీరు కిందికి వెళ్లిందని అధికారులు వివరించారు.
45 లక్షల ఎకరాలకు నీరు
పై నుంచి వచ్చిన వరదకు అనుగూణంగా గేట్లు ఎత్తాలని వీలైనంత వరకు నదిలో నీటిమట్టం ఉంచాలని అధికారులుకు సీఎం ఆదేశించారు. గోదావరిలో మొత్తం వరద తగ్గిన తరువాతనే గేట్లు మూసివేయాలి. మేడిగడ్డ బ్యారేజీని సకాలంలో నిర్మించి ఈ సీజన్‌కు అందించిన ఎల్ అండ్ టీ సంస్థను, ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన కేసీఆర్ సీఎం వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ సంతోష్‌కుమార్, సీఎంవో, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రికి మేడిగడ్డ వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు, పుట్టమధు, శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ స్వాగతం పలికారు. ఎరియల్ వ్యూ ద్వారా, మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహాన్ని సీఎం పరిశీలించారు. అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి వాయినం సమర్పించారు. ప్రత్యేక పూజలుగోలివాడ పంపుహౌజ్ వద్ద...సీఎం కేసీఆర్‌తో పాటు అధికారులు, ఇంజినీర్లు కాళేశ్వరం పనులు పరిశీలించారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజీను సీఎం సందర్శిచారు. గోదావరి నదికి సీఎం పూజలు చేశారు. అక్కడ్నుంచి గోలివాడ పంపుహౌస్‌కు చేరుకుని పంపుహౌజ్‌ను కేసీఆర్ పరిశీలించారు. గోలివాడ పంపుహౌజ్ పరిశీలన అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టుని సందర్శించనున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ పూజలు చేయనున్నారు.

No comments:

Post a Comment