Breaking News

17/08/2019

కాయగూరలకు ధరల భారం

రంగారెడ్డి, ఆగస్టు 17, (way2newstv.com)
కోటి ఆశలతో ఖరీఫ్ సీజన్ ప్రారంభించిన రైతన్న ఆశలు అడియాశలుగానే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించడంతో సాగు విస్తీర్ణం సాధారణం కన్నా రెట్టింపు అవుతుందని అంచనాలు వేస్తే అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైద్రాబాద్ మహనగరంకు ఆనుకోని రంగారెడ్డి జిల్లా ఉండటంతో కూరగాయల సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. ప్రస్తుత సీజన్‌లో వర్షాలు సకాలంలో కురవక పోవడంతో టమాట, క్యారట్, చిక్కుడు, వంకాయలతో పాటు అకుకూరల సాగు సైతం త గ్గు ముఖం పట్టింది. జిల్లాలోని శివారు మండలాల్లో కూరగాయ పంట లు సాగు చేస్తున్న రైతుల వాటిని కాపాడుకోవడానికి ట్రాక్టర్‌లలో నీరు తీసుకువచ్చి పంటలకు పోస్తున్నారు. పత్తి తదితర పంటలకు మొక్క మొక్కకు నీరు పోసుకుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న భానుడి ప్రతాపంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి.
కాయగూరలకు ధరల భారం

ప్రభుత్వం ఇచ్చిన రైతుబందు సహయం తప్ప బ్యాంకర్లు దయతలచకపోవడంతో ప్రైవేట్ అప్పులు చేసిన రైతులు మాత్రం పరేషాన్‌లో కనిపిస్తున్నారు.ఖరీఫ్ సాగు విస్తీర్ణం కేవలం 65% కు మించక పోగా వేసిన పంటలు మొలకదశలోనే ఎండిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,68,260 హెక్టార్‌లు కాగా ఇప్పటివరకు 1,12,781 హెక్టార్‌లలో పంటలు సాగు చేసినట్లు అధికారుల అంచనాలు వేసినా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నా యి. జూన్ మొదటి వారంలో వర్షాలు కురవడం తో పంటలు వేసిన అనంతరం 15 రోజుల పాటు చినుకు రాలక వేసిన విత్తనాలు కనీసం మొలకెత్తిన పాపాన పోలేదు. జూలైలో వర్షం కురవడంతో మరోమారు అదే పొలంలో మరో పంట విత్తనాలు వేసిన గత పది రోజులుగా వరుణుడు కనిపించకపోవడంలో విత్తనాలు వేసిన రైతులు లబోదిబోమంటున్నారు.ఖరీఫ్ సీజన్ ప్రారంబం అయిన నాటి నుంచి జిల్లాలో సాదారణ వర్షపా తం కన్న తక్కువ వర్షపాతం నమోదవుతుంది. జూన్‌లో 91.7 మి.మి సాధారణ వర్షపాతం కాగా 89 మి.మి మాత్రం నమోదయింది. జూలైలో 152 మి.మి సాదారణ వర్షపాతం అయిన అంతకన్న తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మొయినాబాద్, చెవె ళ్ళ, శంకర్‌పల్లి, యాచారం, మంచాల, ఇబ్రహింపట్నం, కొందూర్గు, తలకొండపల్లి, కేశంపేట్, ఫ రూక్‌నగర్, అమన్‌గల్ తదితర మండలాల్లో సాదారణ వర్షపాతం కూడ నమోదు కాకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. రం గారెడ్డి జిల్లా పరిధిలోని 27 మండలాల్లో వర్షాలు లేక భూగర్బ జలాల పరిస్థితి సైతం రోజు రోజుకు పడిపోతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 14 మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వరుణుడు క రుణించని పక్షంలో భూగర్భజలాలు మరింత పడిపోయే ప్రమాదముంది. చినుకు రాలకపోతే రైతన్న పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. వరి నారు వేయడానికి సిద్దంగా ఉన్న ఇప్పటివరకు వరి మడులు మాత్రం తయారు చేయడానికి నీరు లేదు. ఖరీఫ్‌లో వరి సాదారణ సాగు విస్థీర్ణం 14,669 హెక్టార్‌లకు గాను 5,069 హెక్టార్‌లు, జొన్న 6,166కి గాను 2,515 హెక్టార్‌లు, మొక్క జొన్న 56, 282 హెక్టార్‌లకు గాను 33,110 హెక్టార్‌లు, కంది 6,001 హెక్టార్‌లకు గాను 3,539 హెక్టార్‌లు, అముదం 1,574 హెక్టార్‌లకు 184 హెక్టార్‌లు, ఇతర పంటలు 18,879కి 6,731 హెక్టార్‌లు మాత్రం సాగులోకి వచ్చింది. పత్తికి ప్రభు త్వం మద్దత్తు ధర పెంచడంతో అంచనాలకు అనుగుణంగా 60,417కి గాను 61 వేల హెక్టార్‌లలో పత్తి సాగు చేస్తున్నారు.

No comments:

Post a Comment