Breaking News

03/08/2019

భారీ వరదనీరుతో కడెం ప్రాజెక్టు

ఆరు గేట్ల ఎత్తివేత
నిర్మల్, ఆగస్టు 3, (way2newstv.in)
గత రెండు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా  కురుస్తున్న భారీ  వర్షాలకు నిర్మల్ జిల్లా కడెం  ప్రాజెక్టు లో కి భారీగా వరద నీరు  వచ్చి చేరడం తో నీటి పారుదల శాఖ అధికారులు,  ప్రాజెక్టు కు చెంది న  6  గేట్లను ఎత్తి 58800  క్యూసెక్కుల నీటిని గోదావరి లో కి విడుదల చేసారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు
భారీ వరదనీరుతో కడెం ప్రాజెక్టు

( (7 ।6  టి యం సి లు) కాగా ప్రస్తుత నీటి మట్టం  695 అడుగులు ( 6 ।24  టి యం సి లు) గా వుంది భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి వరదనీరు 46498 క్యూసెక్కులు రావడం తో అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు 6 గేట్లను ఎత్తి నీటిని విడుదల  చేసారు.  గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని హెచ్చరికలు జారీ చేసారు.  ప్రాజెక్టు లో కి భారీగా నీరు చేరడం తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లా ల నుండి పర్యాటకులు వచ్చి ప్రకృతి అందాలను తిలకించడం తో ప్రాజెక్టు కు సందర్శకుల తాకిడి పెరిగింది.  

No comments:

Post a Comment