Breaking News

08/08/2019

కాలేజి చదువుతో పాటు సమాజాన్ని కూడా చదవండి

కర్నూలు, ఆగస్టు 08,(way2newstv.in)
కాలేజి విద్యార్ధులు సరదాలు, సంతోషాలతో పాటు అంతే ఇష్టంతో బాగా చదివి వారు అనుకున్న లక్ష్యాన్ని  సాధించాలని, కాలేజి చదువుతో పాటు సమాజాన్ని కూడా చదివి భవిష్యత్తులో అత్యున్నత అభివృద్ధి శిఖిరాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అన్నారు. కుని తాము చదువుతున్న సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కాలేజి గౌరవ ప్రతిష్టలను మరింత పెంచాలని అయన  ఉద్బోధించారు. గురువారం నాడు స్థానిక సిల్దర్ జూబ్లీ ప్రభుత్వ కాళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని  విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు.
కాలేజి చదువుతో పాటు సమాజాన్ని కూడా చదవండి

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫ్రెషర్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం అత్యున్నత లక్ష్యంతో సిల్వర్  జూబ్లీ కళాశాలను 1972 లో స్థాపించిందని, ఈ కళాశాలకు లత్యంత ప్రతిష్టాత్మక కాళాశాలగా మంచి పేరు ప్రఖ్యాతులున్నాయని అన్నారు.  ఈ కాలేజిలో  చదువుకున్న విద్యార్ధదులు ఎంతో మంది  ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లుగా ఎంపికయ్యారు.  మన రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ  కూడా ఇదే  కాలేజి విద్యార్ధే అని గుర్తు చేస్తూ విద్యార్ధులు వారందరినీ స్పూర్తిగా తీసుకుని బాగా  చదవడంతో పాటు  మంచి  నడవడికతో మెలిగి,  భవిష్యత్తులో ఉన్నత  స్థానాలకు ఎదిగి కళాశాలకు, ఆధ్యాపకులకు, తల్లిదండ్రులకు పేరు తీసుకరావాలని కలెక్టర్ సూచించారు.కళాశాల ప్రిన్సిపల్ ఉమాదేవి మాట్లాడుతూ  సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల  రెండు సార్లు వరసగా న్యాక్ ద్వారా  ఏ గ్రేడ్ కళాశాలగా పేరు తెచ్చుకుందని, ఈ కళాశాల పూర్వ విద్యార్ధులు ఎంతో మంది ఐ.ఏ.ఎస్, ఐసిఎస్లు అయ్యారని, కళాశాలలో వున్న ప్రహారీ గోడ సమస్య తీర్చడానికి గత కలెక్టర్ సత్యనారాయణ రూ.20 లక్షలు మాంజురు చేసారని అయిన   నిధులను సరిపోక  అసంపూర్తిగా  అగిపోయిందని, డ్రైనేజి నిర్మణం కోసం రూ.12.50 లక్షల నిధులను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గణేష్ వీరపాండియన్ కు విజ్ఙప్తి చేయగా  కలెక్టర్ వెంటనే అంగికరించి నిధుల మంజూరుకు హామి ఇచ్చారు.అనంతరం, సిల్వర్ జూభ్లీ ప్రభుత్వ కళాశాల ప్రవేశ పరీక్షకు పది వేల మంది హాజరుకాగా అందులో మెదటి ర్యాంకు సాధించిన దుర్గా అనిల్  కు రూ.10116 లను నగదు బహామతిగా జిల్లా కలెక్టర్  అందించారు. అలాగే రుక్మిణి, శ్రుతి, శివప్రసాద్ అనే విద్యార్ధులకు కూడా కాలేజి తరపున నగదు బహుమతులను కలెక్టర్ అందించారు. కళాశాల ప్రిన్సిపల్ ఉమాదేవి. అధ్యాపకులు  జగన్ తో పాటు ఇతర అధ్యాపకులు, విద్యార్ధుని, విద్యార్ధులు,పెద్ద సంఖ్యలో ఫ్రెషర్ డేలో పాల్గొని జిల్లా కలెక్టర్ గణేశ వీరపాండియన్ కు ఘనంగా స్వాగతం పలికారు. 

No comments:

Post a Comment