Breaking News

08/08/2019

నగర స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి – మేయర్ రామ్మోహన్

హైదరాబాద్ ఆగష్టు 8 (way2newstv.in):
ప్రస్తుత వర్షకాలంలో పురాతన, శిథిల భవనాలు కూలి ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నందున వీటిని కూల్చివేయడానికి జీహెచ్ఎంసికి సహకరించాల్సిందిగా  మేయర్ బొంతు రామ్మోహన్ విజ్జప్తి చేశారు. 2020 స్వచ్ఛ సర్వేక్షణ్ లో హైదరాబాద్ కు మెరుగైన ర్యాంక్ సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని, స్వచ్ఛ సర్వేక్షణ్ పై అడిగే 12 అంశాలకు సంబంధించి సానుకూల సమాధానాలు ఇవ్వడం ద్వారా నగరానికి మెరుగైన ర్యాంక్ వచ్చేలా సహకరించాలని కోరారు. 
నగర స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి – మేయర్ రామ్మోహన్

క్షేత్రస్థాయిలో స్వచ్ఛ, అభివ్రుద్ది కార్యక్రమాలను నేరుగా పర్యవేక్షించేందుకుగాను రెండు కోట్ల రూపాయల వ్యయంతో జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం ను ఇటీవలే ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 105 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని, త్వరలోనే వీటి సంఖ్యను 200లకు పెంచుతున్నట్టు తెలిపారు. పేదల సౌకర్యార్థం నగరంలో 12 నైట్ షెల్టర్లు ఏర్పాటు చేశామని, వీటికి తోడు మరో ఏడు నైట్ షెల్టర్లను రూ. 9.71 కోట్లతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నగర సమస్యల పరిష్కారానికై ఏర్పాటుచేసిన జిహెచ్ఎంసి ట్విట్టర్ కు విశేష స్పందన లభిస్తుందని, దాదాపు లక్ష మందికి పైగా ఈ ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారని మేయర్ వివరించారు. ఇటీవల దివంగతులైన మాజీ కేంద్ర మంత్రులు ఎస్. జయపాల్ రెడ్డి, శ్రీమతి సుష్మాస్వరాజ్, రాష్ట్ర మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ లతో పాటు ప్రమాదంలో మరణించిన ఇద్దరు జీహెచ్ఎంసి ఉద్యోగుల ఆత్మశాంతికై నేడు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన జీహెచ్ఎంసి సర్వసభ్య సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ; ఈ సందర్భంగా మాజీ మంత్రులు అందించిన సేవలను మేయర్ రామ్మోహన్ కొనియాడారు.

No comments:

Post a Comment