Breaking News

14/08/2019

మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా తనిఖీలు

మహబూబ్ నగర్, ఆగస్టు 14  (way2newstv.in - Swamy Naidu)
శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా పోలీసు బలగాలు జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా గార్డులు, స్పెషల్ పార్టీ కమెండోలు, సాయుధ బలగాలతో కూడిన స్థానిక పోలీసు అధికారులు బృందాలుగా ఏర్పడి వివిధ వాహనాలను, రద్దీ ప్రదేశాలు, నిఘా వర్గాల సమాచారం మేరకు అనుమానిత ప్రాంతాలు, కాలనీలు, లాడ్జీలను నిశితంగా తనిఖీలు చేస్తున్నారు. 
మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా తనిఖీలు
అవసరమైనచోట్లలో పోలీసు జాగిలాలను కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. సాధారణ తనిఖీలను నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు ప్రజలు సహకరించాలని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎస్.పి. రెమా రాజేశ్వరి  తెలిపారు.

No comments:

Post a Comment