Breaking News

25/07/2019

అడ్డదారులు తొక్కుతున్న ఇసుక మాఫియా

ఒంగోలు జూలై 25 (way2newstv.in)
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో గుండ్లకమ్మ నది లో ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా సాగిస్తున్నారు. భారీ ప్రోక్లైన్ ల సహాయంతో రోడ్డు మార్గాన్ని సైతం ఏర్పాటు చేసుకొని ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం  ఇసుక తవ్వకాల పై రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయడంతో బహిరంగ మార్కెట్లో ఇసుక గిరాకీ పెరిగింది. ఇదే అదనుగా దలచిన ఇసుకాసురులు ప్రోక్లైన్ సహాయంతో ట్రాక్టర్లకు లోడ్ చేసుకుంటూ వారి స్థావరాల్లో నిల్వ చేసుకొని ఇసుకను అధిక ధరలకు అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 
అడ్డదారులు తొక్కుతున్న ఇసుక మాఫియా 

దీనికితోడు అధికార పార్టీ నాయకులు అండదండలు ఉండడంతో ఏమాత్రం లెక్కచేయకుండా పట్టపగలే గుండ్లకమ్మ నదీ గర్భంలో ఇసుక తోడేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానికులు రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ వారు మాత్రంమాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఎట్టకేలకు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జిలాని ఇచ్చిన సమాచారం మేరకు అద్దంకి ఎస్ఐ శ్రీనివాస రావు రంగంలోకి దిగారు. గుండ్లకమ్మ నుంచి ఇసుకతో తరలివస్తున్న నాలుగు ట్రాక్టర్ల తో పాటు ప్రోక్లైన్  ను అదుపులోకి తీసుకుని ఇసుకాసురుల అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. అదుపులోకి తీసుకున్న వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇసుక అక్రమ రవాణా దారులపై కఠిన చర్యలు చేపడతామని ఎస్సై శ్రీనివాస రావు తెలిపారు.

No comments:

Post a Comment