Breaking News

25/07/2019

పాతబస్తీ బోనాల ఏర్పాట్లు

హైదరాబాద్, జూలై 25 (way2newstv.in)
హైదరాబాద్ పాతబస్తీలో బోనాల ఉత్సవ ఏర్పాట్లను గురువారం  మంత్రి శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా పాతనగర ఉమ్మడి దేవాలయాల కమిటీ, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు వివిధ శాఖల కు చెందిన అధికారులతో కలిసి చరిత్రాత్మక దేవాలయాలను సందర్శించారు. ముందుగా ఉప్పుగూడ అండర్ రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించారు. 
పాతబస్తీ బోనాల ఏర్పాట్లు

చిన్న చిన్న పనులు ఉన్నాయని మరో రెండు నెలలు పడుతుందని అధికారులు మంత్రికి వివరించారు.  దీంతో వెంటనే స్పందించిన మంత్రి అమ్మవారి ఘటాలు ఉప్పుగూడ అండర్ రైల్వే బ్రిడ్జి నుంచి ప్రస్తుతానికి వెళ్ల వచ్చని అధికారికంగా పనులు పూర్తయ్యాక మరోసారి ప్రారంభోత్సవ కార్యక్రమం పెడతామని చెప్పారు..  అక్కడి నుంచి ఛత్రినాక రిశీలించారు. బోనాల ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుపూర్తి చేసినట్లు పేర్కొన్నారు. .

No comments:

Post a Comment