Breaking News

25/07/2019

ఏపీకి వరుసగా షాక్

న్యూఢిల్లీ, జూలై 25 (way2newstv.in):
ఏపీ సర్కార్‌కు కేంద్రంలో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని పార్లమెంట్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. లోక్‌సభలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేవనెత్తిన ఓ ప్రశ్నకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే దేశ వ్యాప్తంగా అమలు చేయడం తప్ప... ఒక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా చేయడం సాధ్యం కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. 
ఏపీకి వరుసగా  షాక్

విశాఖపట్నంలో నెలకొల్పిన మెడిటెక్ జోన్ బాగా పని చేస్తోందని కితాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలతో వస్తే.. ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నితిన్ గడ్కరీ సభలో వెల్లడించారు.
అటు హైకోర్టులో...
కోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పీపీఏలను(పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్) సమీక్షించాలని ప్రభుత్వం జారీ చేసిన.. జీవో నెం. 63ను ఉన్నతన్యాయస్థానం నాలుగు వారాల పాటు సస్పెండ్‌ చేసింది. పీపీఏలపై సంప్రదింపులకు రావాలని.. ఏపీఎస్పీడీసీఎల్‌ రాసిన లేఖను కూడా సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. పీపీఏల సమీక్షకు ప్రభుత్వం జారీ చేసిన జీవోపై.. 40 విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి కంపెనీల తరపున సుప్రీం కోర్టు న్యాయమూర్తి ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు.

No comments:

Post a Comment