కొనసాగుతున్న వేట
అనంతపురం, జూలై 5 (way2newstv.in)
అనంతపురం జిల్లా వజ్రకరూర్ గ్రామంలో చినుక పడితే సాలు వందల మంది ఉదయం ఆరు గంటలకే పొలాల్లో ప్రత్యక్షం అవ్వుతారు...పొలం పనులు కోసం కాదండోయి....వజ్రాలు వేట కోసం...కొన్ని సంవత్సరాలుగా ఈ వజ్రాలు వేట కొనసాగుతుంది..జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు నుంచి కూడా వజ్రాలు వేట కోసం వస్తుంటారు...మరి వారి అందరికి వజ్రాలు దొరుకుతున్నాయా వాచ్ దిస్ స్టోరీ....రాయలసీమ అంటే రతనాలు సీమగా పిలవపడేవారు... శ్రీకృష్ణదేవరాయలు రాజులు కాలంలో రతనాలు రాసులుగా పోసి అమ్మేవారని చెప్పుకొనే వారు...రాను రాను రాయలసీమను రాళ్ల సీమగా మారిపోయింది... అయితే అనంతపురం జిల్లా అంటేనే ఇప్పుడు టక్కనే గుర్తుకువచ్చేది కరువు.జిల్లాలో ఏ సంవత్సరం వర్షం వస్తుందో ఎప్పుడు పంటలు పండతాయో తెలియని పరిస్థితి...అయితే అనంతపురం జిల్లా వజ్రకరూరులో మాత్రం ఏ చిన్న పాటి వర్షం కురిసినా ఆ గ్రామ పొలాల్లో మాత్రం ఎక్కడ చూసినా జనాలు ప్రత్యక్షం అవ్వుతారు.తొలకరి జల్లు పడిందంటే చాలా కరవు సీమలో ఆశలు తాండవమాడుతాయి. ఎర్రటి నేలల్లో వెదుకులాట మొదలవుతుంది. ఒళ్లంతా కళ్లు చేసుకుని తళుక్కుమనే మెరుపు కోసం వెతుకులాట ప్రారంభమవుతుంది. ఒక్కటంటే ఒక్కటి దొరికితే జీవితమే మారిపోతుంది. కరవంతా తీరిపోతుంది.
ఆ ఒక్క వజ్రం కోసం..
కరవు సీమలో ఆడా, మగా..చిన్నా చితకా..ముసలీ ముతకా అంతా ఎర్రనేలలను జల్లెడ పట్టేస్తుంటారు. ఈ వెతుకులాటంతా వజ్రాలు కోసం! నేలల్లో దాగి ఉన్న వజ్రాలు తొలకరి జల్లులకు బైటపడతాయి!!. వాటికోసమే ఈ వెతుకులాట. రాయలసీమలో వరుణుడి కరుణతో రతనాలు బైటపడతాయి. ప్రతీ ఏటా తొలకరి పలకరించగానే తొలకరి జల్లులు పడటంతోనే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట మొదలైపోతుంది. వజ్రాల కోసం స్థానికులే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం భారీగా తరలి వచ్చే జనంతో ఎర్రటిపొలాలన్నీ నిండిపోతాయాయి. వజ్రాలకు పేరుగాంచింది...వజ్రకరూరు. ఏటా తొలకరి వర్షాలు కురవగానే ఆశల వేట ప్రారంభమవుతుంది. అదృష్టంకొద్దీ ఒక్క వజ్రమైన తమ కళ్లబడకపోతుందా అని..ఓ రంగురాయి తమ జీవితం మార్చకపోతుందా అనే వెర్రి ఆశతో వెతులాడుతుంటారు.వజ్రకరూర్ వజ్రాలకు మంచి డిమాండ్ ప్రతీ ఏటా తొలకరి జల్లులు పడే సమయంలో పొలాల్లో 10 నుంచి 20 వరకు వజ్రాలు దొరుకుతాయని స్థానికులు చెబుతుంటారు. ఇటీవల వజ్రకరూరు ప్రాంతంలో జల్లులు కురవటంతో వజ్రాలకోసం వెతుకులాట మొదలైంది. ఈ వజ్రాల వేట పొలాల్లో విత్తనం చల్లే వరకు కొనసాగుతుందని.పల్లపు ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట నీరు పల్లానికే ప్రవహిస్తుంది. వర్షం పడగానే వర్షపు నీటితో పాటు మట్టి కూడా పల్లపు ప్రాంతానికి కొట్టుకు వస్తుంది. ఆ నీటితో పాటే వజ్రాలు కొట్టుకు వస్తాయనే నమ్మకంతో పొలాల్లోని లోతట్టు ప్రాంతాల్లోనే వజ్రాల కోసం వెతుకులాడుతుంటారు ఆశావహులు. ప్రతీ ఏటా తొలకరి పలకరించగానే తొలకరి జల్లులు పడటంతోనే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట మొదలైపోతుంది. వజ్రాల కోసం స్థానికులే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం భారీగా తరలి వచ్చే జనంతో ఎర్రటి పొలాలన్నీ నిండిపోతాయాయి. వజ్రాలకు పేరుగాంచిందివజ్రకరూరు. ఏటా తొలకరి వర్షాలు కురవగానే ఆశల వేట ప్రారంభమవుతుంది. అదృష్టంకొద్దీ ఒక్క వజ్రమైన తమ కళ్లబడకపోతుందా అని..ఓ రంగురాయి తమ జీవితం మార్చకపోతుందా అనే వెర్రి ఆశతో వెతులాడుతుంటారు.గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తారు..కాపు కాసిన వ్యాపారులు గుట్టుగా కొనేస్తారు అటువంటి ఆశావహులు కొందరికి ఒక్క వజ్రం దొరికితే..ఎవ్వరికి చెప్పరు. గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లి అమ్ముకుంటారు. తొలకరి జల్లు పడే సమయానికి వజ్రకరూర్ పరిసర ప్రాంతాలకు వ్యాపారులు తరలివస్తారు. అక్కడే తిష్టవేసి..వజ్రాలను అమ్మేందుకు వచ్చేవారి కోసం కాపుకాసుకుని ఉంటారు.వీరికి అతి తక్కువ ధర చెల్లించి వారు మాత్రం డిమాండ్ ఉన్న ప్రాంతాలకు వెళ్లి అధిక ధరలకు రీసేల్ చేసుకుంటారు. ఇలా 2018లో వజ్రకరూర్ ప్రాంతంలో లక్షల రూపాయల విలువచేసే వజ్రాలు లభ్యమైయ్యాయి. అంటే సామాన్యులకు ఒక్క వజ్రం దొరికినా వారి పంట పండినట్లే. దొరకకపోతే వచ్చే నష్టం కూడా ఏమీ లేదు వెతులాట పడిన కష్టం పోతుందంతే. కానీ ఒక్కటంటే ఒక్కటన్నా దొరికితే చాలు తమ బతుకులు మారిపోతాయనే ఆశతో ప్రతీ ఏటా తొలకరి జల్లులు పడిన వెంటనే ఈ వజ్రాల వెతుకులాటలు కొనసాగుతునే ఉంటాయి. వజ్రాలు వేటలో బిజీ అవ్వుతారు...జిల్లా నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి నాలుగు నెల పాటు ఇక్కడే ఉంటూ వజ్రాలు వేటలో వారి లక్కు పరీక్షించుకుంటారు..కొంత మందికి లక్కు కలిసొస్తుంది...కొందరు నిరాశతో వెనుకకు తిరుగుతారు... అయితే పట్టు విడవని విక్రమార్కుడు లా నాలుగు ఐదు సంవత్సరాలుగా వజ్రాలు కోసం ఈ వజ్రకరూరుకి వస్తుంటారు... ఒక్క వజ్రం దొరికితే మాత్రం వారి తలరాతలు మారుతాయి అంటున్నారు..ఇక్కడ దొరికే వజ్రాలకు మంచి డిమాండ్ తోపాటు మంచి ధర పలుకుతుంది అంటున్న గ్రామస్తులు.... వజ్రకరూరులో భూగర్భ ఖనిజ సంపద పరిశోధకులు కూడా ఈ గ్రామంలో డిమాండ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు... ఇక్కడ బంగారు ఖనిజాలతో పాటు డిమాండ్స్ ఉన్నాయి అని నిత్యం పరిశోధన చేస్తూనే ఉంటారని ఇక్కడ గ్రామస్తులు చేబుతుంటారు.గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ నిక్షేపాలు ఉన్నాయా లేదా అని ఇప్పటికి తేల్చని అధికారులు...అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాల్లో వజ్రకరూరు,గుంతకల్లు, కర్నూల్ జిల్లా అయిన జొన్నగిరి,చిప్పగిరి ప్రాంతాల్లో వజ్రాలు దోరుకుతున్నాయిని ఇక్కడ ప్రజలకి పెద్ద నమ్మకం...సో ప్రతి సంవత్సరం మే నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలు పాటు వారి లక్కు పరిక్షంచుకుంటారు.మరో వైపు ఏడాది మే 24న కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వ్యాపారులు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. ఒక్కో వజ్రాన్ని రూ.1.10 లక్షలకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం. మరో వజ్రాన్ని రూ.30 వేలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. కాగా ఇలా లభ్యమైన వజ్రాలు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దీనిపై ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment