Breaking News

05/07/2019

ప్రాణాల మీదకు సెల్ఫీ పిచ్చి


రాజమండ్రి. జూలై 5 (way2newstv.in)
విభిన్నమైన ప్రాంతాల్లో ఫోటో కొట్టు సోషల్ మీడియా లో పెట్టు. ఈ భిన్నత్వంలో తీసే దృశ్యాలతో ఎక్కువ లైక్ లు, కామెంట్లు కుప్పలు కుప్పలుగా వచ్చి పడతాయి. దాంతో సరదాగా మొదలైన ఈ సెల్ఫీ అనేక దుస్సంఘటనలకు దారి తీస్తుంది. సెల్ఫీ యుగం మొదలయ్యాక అనేకమంది ఆ మాయలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. రైళ్ళల్లో, బస్సుల్లో, కార్లలో, జలపాతాలు, పర్వతాలు, సముద్ర తీరాల్లో సెల్ఫీల కారణం గా చావు కొని తెచ్చుకుంటున్న సంఘటనలు నిత్యం పెరిగిపోతూనే వున్నాయి.

ప్రాణాల మీదకు సెల్ఫీ పిచ్చి

అయితే తాజాగా తమిళనాడులో జరిగిన చిన్న సెల్ఫీ సంఘటన ఒక వ్యక్తి ప్రాణం మోవడానికే కారణం అయ్యింది. ఒక కుటుంబానికి విషాదం మిగిల్చింది.రాజమండ్రి మంగళవారపుపేట కు చెందిన ఆకాశ్  అనే వ్యక్తి తమిళనాడు లోని కాంచీపురం వెళ్లారు. ఆలయంలో ఫోటోలు వీడియోలు తీయరాదని హెచ్చరిక బోర్డు లున్నా ఆకాష్ సెల్ఫీలు తీసుకుంటూ ఉండటంతో అక్కడ వున్న పోలీసులు హెచ్చరించారు. ఆ హెచ్చరికలు పెడచెవిన పెట్టి బంగారు బల్లి వున్న చోట సెల్ఫీ దిగుతుండగా అక్కడి పోలీసులు ఆకాశ్ ను నిరోధించారు. ఆ సందర్భంగా అనుమానాస్పద స్థితిలో ఆకాష్ మృతి చెందడం సంచలనం అయ్యింది.ఈ ఘటనపై ఆకాష్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలతోనే ఆకాష్ చనిపోయాడని హత్య చేశారని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే స్థానిక జిల్లా కలెక్టర్, ఎస్పీ లు గుండెపోటుతోనే ఆకాష్ చనిపోయాడని పేర్కొన్నప్పటికీ సంఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. ఇలా సెల్ఫీల సందర్భంగా చోటు చేసుకుంటున్న దుస్సంఘటనలు నుంచి మాత్రం గుణపాఠాలు నేర్చుకోకపోవడం పట్ల అందరిలో ఆందోళన వ్యక్తం అవుతుంది.

No comments:

Post a Comment