Breaking News

12/07/2019

గ్రేటర్ లో ముందస్తు వ్యూహం

హైద్రాబాద్, జూలై 12(way2newstv.in)
గ్రేటర్ లో మున్సిపల్ ఎన్నికలు జరిపాలని భావిస్తున్న తెలంగాణలోని అధికార టీఆర్ఎస్... మున్సిపల్ ఎన్నికలతో పాటే కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరపాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2015లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకుని గ్రేటర్‌లో తిరుగులేని ఆధిక్యత సాధించిన టీఆర్ఎస్... తెలంగాణ రాజకీయాలపై మరింతగా తన పట్టును పెంచుకున్న సంగతి తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో బీజేపీ భారీగా బలం పుంజుకోవడంతో... జీహెచ్ఎంసీలో మరోసారి పట్టు నిలుపుకోవడంపై టీఆర్ఎస్ అధినాయకత్వం సీరియస్‌గా దృష్టి సారిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రయ్యారు. 
గ్రేటర్ లో ముందస్తు వ్యూహం

జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి నగరంలో పార్టీని మరింత పటిష్టం చేసి గ్రేటర్‌లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. గ్రేటర్‌లో చాలా మంది కార్పొరేటర్లు ఆర్థికంగా, సామాజికంగా బలమైన వారు ఉన్నారు. చాలామంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ల కోసం కూడా గట్టిగా ప్రయత్నించారు. అయితే సిట్టింగ్‌లకే టీఆర్ఎస్ మళ్లీ అవకాశం ఇవ్వడంతో, ఆశావహులు అసంతృప్తితో రగిలిపోయారు. తమ భవిష్యత్ రాజకీయ అవసరాలకోసం ప్రత్యామ్నాయ అవకాశాల కోసం అన్వేషిస్తున్నారని చర్చ జరుగుతోంది. అలాంటి వారిని పార్టీలోకి ఆహ్వానించి ముందుగానే కార్పొరేటర్‌గా అవకాశం కల్పించి... ఆ తరువాత ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. ఈ దిశగా పలువురు నేతలతో బీజేపీ చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. బీజేపీ వ్యూహాం ఇలా ఉంటే... రాష్టంలో, జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ బలపడకముందే ఎన్నికలు నిర్వహించి మరోసారి గ్రేటర్ పీఠాన్ని తమ సొంతం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోందని తెలుస్తోంది. ఈ విషయంలో ఆలస్యమవుతున్న కొద్దీ బీజేపీ తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో లబ్ది పొందిన టీఆర్ఎస్... కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో అలాంటి నిర్ణయం తీసుకుంది

No comments:

Post a Comment