Breaking News

12/07/2019

రాటు దేలుతున్న పళని స్వామి

చెన్నై, జూలై 12(way2newstv.in)
అధికార అన్నాడీఎంకేకు మరోసారి పరీక్ష ఎదురుకానుంది. జయలలిత మరణం తర్వాత జరుగుతున్న వరస ఎన్నికల్లో ఓటమి ఎదురవతూ వస్తోంది. ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అమ్మ నామస్మరణం చేసినా వారికి అనుకున్న విజయాలు దక్కడం లేదు. జయలలిత చరిష్మాతో ఏర్పడిన ప్రభుత్వాన్ని పూర్తికాలం కొనసాగించేందుకు ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసమే వారు భారతీయ జనతా పార్టీతో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. మరోసారి వేలూరు ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు వ్యూహాలు రచిస్తున్నారు.భారతీయ జనతా పార్టీతో పొత్తు చేటని పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు తెలియంది కాదు. 
రాటు దేలుతున్న పళని స్వామి

అయితే ప్రభుత్వం పూర్తికాలం కొనసాగాలంటే బీజేపీతో సఖ్యత అవసరం. ఇది గ్రహించే మహాకూటమిని ఏర్పాటు చేశారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అన్నాడీఎంకే కు ఒకే ఒక్క స్థానం దక్కింది. తేని స్థానంలో పన్నీర్ సెల్వం కుమారుడు రాఘవేంద్ర ను గెలిపించుకోవడం మినహా వీరు సాధించిన విజయమంటూ ఏమీ లేదు.ఇక దాదాపు 22 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అందులో తొమ్మిది స్థానాల్లో మాత్రమే అన్నాడీఎంకే విజయం సాధించింది. ఇది చెప్పుకోదగ్గ విజయమేమీ కాకపోయినా ఈ సంఖ్యతో ప్రభుత్వం నిలబడిందనే చెప్పాలి. ఉప ఎన్నికలలో ఎక్కువ స్థానాలను గెలుచుకుంటే అధికారంలోకి వస్తామని భావించిన స్టాలిన్ ఆశలకు పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు గండి కొట్టారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా ఇద్దరూ కలసి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.ఒకవైపు డీఎంకే అధినేత స్టాలిన్ అధికారం కోసం కాచుక్కూర్చుని ఉండగా, మరోవైపు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. అయితే దినకరన్ గూటికి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి మిగిలిన ఎమ్మెల్యేలకు వెళితే వేటు తప్పదన్న సంకేతాలను బలంగా పంపడంతో కొంత సఫలీకృతులయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికలు కూడా వీరిద్దరి సారథ్యంలోనే జరగనున్నాయి. అయితే అప్పటి పరిస్థితులును అంచనా వేయకుండా ఇప్పటి ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు దృష్టి పెట్టారు.

No comments:

Post a Comment