Breaking News

09/07/2019

కోమటిరెడ్డిపై మండిపడ్డ తెరాస ఎమ్మెల్యేలు


హైదరాబాద్, జూలై 9, (way2newstv.in)
ఒక పత్రికలో వచ్చిన వార్తను పట్టుకొని మా ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెరాస ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్ ,కె.పి .వివేకానంద ,ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు మంగళవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బాల్క సుమన్ మాట్లాడుతూ శంభిపూర్ రాజు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. భూకబ్జాలు, దందాలు చేయటం కాంగ్రెస్ నేతలకు అలవాటు. కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అవినీతి పనులు చేశారో చరిత్ర బయటికి తీయమంటారా. ఎదుగుతున్న బలహీన వర్గాల నాయకులపై కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. రాజుపై వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. .మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నా పై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నా. .నేను నా గెలుపు కోసమే ప్రయత్నించా తప్ప ఎవరి ఓటమి కి ప్రయత్నించలేదు. సోమారం రాజకీయాలు అందరికీ తెలుసు. బీజేపీ నేత లక్ష్మణ్ తెరాస ప్రభుత్వం పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ తాను చేసిన అవినీతి ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేసారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు జరిగిన అన్యాయం పై మాట్లాడ లేకే లక్ష్మణ్ వేరే అంశాల పై అనవసరం గా గొంతు చించు కుంటున్నారు. బీజేపీ ఆటలు తెలంగాణ లో సాగవని అన్నారు. 

కోమటిరెడ్డిపై మండిపడ్డ తెరాస ఎమ్మెల్యేలు

కె .పి .వివేకానంద  మాట్లాడుతూ కోమటి రెడ్డి వెంకట రెడ్డి వి మతి తప్పిన మాటలు. ఆయన పూటకో మాట మాట్లాడతారని విమర్శించారు. .మా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సొంత ఊర్లో ఇల్లు కట్టుకుంటే కోమటి రెడ్డి కి ఎందుకు బాధ  అని ప్రశ్నించారు. .బలహీన వర్గాలకు చెందిన వారు ఎదిగితే కోమటి రెడ్డి ఓర్వలేకపోతున్నారు. .ఎక్కడో బ్రాహ్మణవేల్లం లో పుట్టిన కోమటి రెడ్డి లోటస్ పాండ్ లో ఇల్లు కట్టుకుంటే మేము తప్పుబట్టామా ? .మా ఎమ్మెల్సీ ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ రోడ్ల పై కి నీళ్లు వస్తున్నాయని కోమటి రెడ్డి మాట్లాడటం అర్ధరహితం. శంభీ పూర్ రాజు పై కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తాం. కోమటి రెడ్డి ని రోడ్డుకు ఈడుస్తామని అన్నారు. ఢిల్లీ నుంచి ఏ కమిటీ వేసుకుని కొంటు రెడ్డి వస్తారో రమ్మనమండి ..తేల్చుకుంటాం. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఎదిగితే ఓర్వలేకపోతున్నారు. కేటీఆర్  అండతో కబ్జాలు చేస్తున్నామని కోమటి రెడ్డి చెబుతున్నారు .ఆధారాలుంటే నిరూపించాలి. .లేదంటే ముక్కు నేలకు రాయాలని అన్నారు. హైదరాబాద్ లో కరెంటు ,తాగునీటి సమస్య పరిష్కరించాం .శాంతి భద్రతల ను పరిరక్షించాం . కోమటి రెడ్డి అసత్య ఆరోపణలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. కోమటి రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని అన్నారు.ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ నా పై కోమటి రెడ్డి మతి తప్పి ఆరోపణలు చేశారు. నేను అన్ని అనుమతులు తీసుకునే నా గ్రామం లో ఇల్లు కట్టుకున్నాను. ఓ బీసీ నేత ఎదగడాన్ని కోమటి రెడ్డి ఓర్చుకోలేక పోతున్నారు. నా పై కబ్జా ఆరోపణలు కోమటి రెడ్డి నిరూపించాలి ..లేదంటే ఎంపీ పదవి కి రాజీనామా చేయాలి ..కోమటి రెడ్డి వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా నని అన్నారు. .కోమటి రెడ్డి తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి .లేదంటే పరువు నష్టం దావా వేస్తా. .ఈ వ్యవహారం లోకి  కేటీఆర్ ను లాగడం కోమటి రెడ్డి కి మంచిది కాదు. నేను 21 సంవత్సరాల వయసులో తెలంగాణ ఉద్యమం లోకి వచ్చాను. కేవలం డబ్బుల సంపాదన పరమావధి అయితే నేను అపుడే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లోకి వెళ్లే వాణ్ని. అవసరమైతే నా ఇంటిని చూడడానికి మీడియా ప్రతినిధులను కూడా తీసుకెళతా. నేను ఎక్కడైనా ప్రభుత్వ భూమి గజమైనా ఆక్రమించు కున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్దమే నని అన్నారు. ఆత్మ గౌరవం తో బతికాను ..దాని కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమే. తెలంగాణ ఉద్యమం లో కోమటి రెడ్డి లాంటి గుండాలతో పోరాడాను ..ఇపుడు కూడా పోరాడతాను. కొమటి రెడ్డి కే భారీ ఇల్లు కట్టుకునే హక్కు ఉందా ...నా లాంటి బలహీన వర్గాల వ్యక్తి 120 గజాల్లో రెండు గదులు కట్టుకోకూడదా అని అడిగారు. మొత్తం ఆరువందల గజాల్లో నిర్మాణాలకు అనుమతి ఉందని అన్నారు. 

No comments:

Post a Comment