Breaking News

22/07/2019

కలివిడిగావరుణ్ సందేశ్ జంట

హైద్రాబాద్, జూలై 22 (way2newstv.in)
తెలుగు బుల్లితెరపై ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఇప్పటి వరకు రెండు సీజన్లలో వినోదాన్ని పంచింది. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో విపరీతంగా పాపులర్ అయ్యింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో కనీవినీ ఎరుగని టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఆ తరవాత నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీజన్ 2 కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు కింగ్ నాగార్జున హోస్ట్‌గా మూడో సీజన్ మొదలైంది. ఈ సీజన్‌లో 15 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వీరిలో ఇద్దరు కంటెస్టెంట్లు ప్రత్యేకంగా నిలిచారు. ఎందుకంటే వారిద్దరూ నిజజీవితంలో భార్యభర్తలు. సినీ హీరో వరుణ్ తేజ్, ఆయన సతీమణి, నటి వితికా షెరు 14, 15వ కంటెస్టెంట్లుగా బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. 
కలివిడిగావరుణ్ సందేశ్ జంట

మిగిలిన కంటెస్టెంట్లంతా ఒక్కరొక్కరిగా వేదికపైకి ఎంట్రీ ఇస్తే.. ఈ జంట కలిసే వచ్చారు. తన సూపర్ హిట్ సినిమా ‘కొత్తబంగారులోకం’లో ‘నిజంగా నేనేనా’ అనే పాటతో క్లాస్ లుక్‌లో మొదట వరుణ్ సందేశ్ వచ్చారు. అదే సినిమాలోని ‘నేనని నీవని’ పాటతో వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు పైనుంచి దేవతలా దిగివచ్చారు. మొత్తంగా ఈ జంట తమ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు, హోస్ట్ నాగార్జునను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. వరుణ్ సందేశ్ వేసుకొచ్చిన లేత గులాబీ రంగు సూట్ భలే ఉందంటూ నాగార్జున కాంప్లిమెంట్ ఇచ్చారు. ‘సినిమాల్లో చూసిన తరవాత చాలా ఏళ్లకు నిన్ను కలుస్తున్నాను. ‘హ్యాపీడేస్’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ తరవాత ఎన్నో సినిమాలు చేశావు. ప్రేమలో పడ్డావు’ అంటూ వరుణ్ సందేశ్, వితికా షెరు ప్రేమ కథ దగ్గర నాగార్జున ఆపారు. తనకు ప్రేమకథలంటే ఎంతో ఇష్టమని, మీ లవ్ స్టోరీ చెప్పండంటూ వితికాను నాగార్జున అడిగారు. తమ ప్రేమకథను నాగార్జునకు వితికా షెరు వివరించారు. ‘ఒక సినిమాలో (పడ్డానండి ప్రేమలో మరి) మేమిద్దం హీరోహీరోయిన్లుగా చేశాం. మొదటి మూడు నెలలు మేమిద్దరం అస్సలు మాట్లాడుకోలేదు. ఎప్పుడు చూసినా యాటిట్యూడ్‌గా ఉండేవాడు. 22 సినిమాలు చేశారు కదా.. అసలే తెలుగమ్మాయిని, ఇప్పటి వరకు అంతా నార్త్ ఇండియన్ అమ్మాయిలతో షూటింగ్ చేశారు అని నేను ఫీలయ్యేదాన్ని. మూడు నెలల తరవాత ఆఖరి షెడ్యూల్‌లో పాట షూటింగ్ కోసం మలేసియా వెళ్లాం. అప్పుడు నాకు తెలిసింది ఈయన నన్ను ఇష్టపడుతున్నారని. నేనూ ఇష్టపడుతున్నానని ఆయనకి తెలిసింది. ఆ తరవాత నేనే అడిగాను.. పెళ్లి ఇష్టమైతేనే లవ్ అని. ఫస్ట్ పెళ్లి తరవాత లవ్ గురించి ఆలోచిద్దాం అన్నాను. దానికి ఈయన ఓకే చెప్పారు. పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నాం’ అని వితికా వెల్లడించారు. ఈ ప్రేమకథ అయిపోయిన తరవాత వరుణ్ సందేశ్ జంటకు నాగార్జున ఒక క్లిష్టమైన ప్రశ్నను సంధించారు. ‘13 మంది ఎలిమినేట్ అయిపోయారు. మీరిద్దరే ఉన్నారు. అలాంటి క్లిష్టపరిస్థితిలో ఎవరు ఎలా డిసైడ్ అవుతారు నాకు చెప్పండి’ అని నాగార్జున అడిగారు. దీనికి వితికా స్పందిస్తూ.. ‘మేమిద్దం ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే, నేను ఇన్ని రోజులూ కష్టపడి ఇంత శ్రమపడ్డాను కాబట్టి నేనే గెలవాలని అనుకుంటాను. వరుణ్‌ను పక్కన పెట్టేస్తాను’ అని బదులిచ్చారు. ఇక వరుణ్ మాట్లాడుతూ.. ‘నేను కూడా గెలుద్దామనే అనుకుంటాను. తను గెలిచినా కూడా హ్యాపీనే. ఎందుకంటే ఆమె నా భార్య, ఆమె గెలిస్తే నేను గెలిచినట్టే’ అని సమాధానం ఇచ్చి నాగార్జునను ఇంప్రస్ చేశారు. ఆ తరవాత ‘జంటగా వెళ్తున్నారు.. ఒంటరిగా ఆడాలి’ అని వాళ్లిద్దరినీ నాగార్జున హౌజ్‌లోకి పంపించారు. కాగా, వితికా షెరు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లమా చేశారు. 11 ఏళ్ల వయసులో టీవీ సీరియళ్లలో బాలనటిగా నటించిన వితికా.. 15 ఏళ్లకు హీరోయిన్ అయ్యారు. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా తెరంగేట్రం చేశారు. తెలుగులో ఆరు సినిమాలు చేశారు. వీటిలో ‘ఝుమ్మంది నాదం’, ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలు చెప్పుకోదగినవి. 2015లో వరుణ్ సందేశ్‌ను వితికా వివాహం చేసుకున్నారు. 

No comments:

Post a Comment