Breaking News

26/07/2019

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు సరికొత్త సొగసులు

సూర్యాపేట,  జూలై 26 (way2newstv.in)
సూర్యపేట జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు అధునాతన విద్యుద్దీకరణ కు రంగం సిద్దమౌతుంది. 20 కోట్ల అంచనా వ్యయం తో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి 20 కోట్ల అంచనా వ్యయం తో నిర్మిస్తున్న ఈ మార్కెట్ యావత్ భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా ఉండేలా డిజైన్ రూపొందించిన విషయం విదితమే. అయితే సమీకృత మార్కెట్ భవన నిర్మాణాలు పూర్తి కావస్తుండడం తో అందులో ఏర్పాటు చేయాల్సిన విద్యుద్దీకరణ పనుల పై మంత్రి జగదీష్ రెడ్డి దృష్టి సారించారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు సరికొత్త సొగసులు

అందులో భాగంగా సచివాలయంలో నీ డి బ్లాక్ లో ఉన్న తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సుధీర్గంగా సమీక్షించారు. మార్కెటింగ్ విభాగం యస్.ఇ ఉమామహేశ్వరరావు, ఇ ఇ రామారావు లతో పాటు డి ఇ రాధాకృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు  సన్ లైట్ తో విద్యుద్దీకరణ పనులు చేపట్టనున్న *స్కై షేడ్* ఏజెన్సీ బృందం ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తొలుత గా మార్కెటింగ్ అధికారులతో సమీక్షిస్తూ త్వరితగతిన సమీకృత మార్కెట్ భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుద్దీకరణ పనుల విషయమై ఆయన ప్రసావిస్తూ మోడల్ మార్కెట్ లో ఆధునిక పరిజ్ఞానం తో చేపడుతున్న విద్యుద్దీకరణ లో ఎటువంటి రాజీ లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. సన్ లైట్ సిస్టం తో చేపడుతున్న  ఈ విద్యుద్దీకరణ పగలు రాత్రి ఒకేలా ఉండేలా చూడాలని చెప్పారు.

No comments:

Post a Comment