Breaking News

22/07/2019

రాజు గారి మౌనం ఎందుకో

విజయనగరం, జూలై 22, (way2newstv.in)
విజయనగరానికి చెందిన రాజకీయ దిగ్గజం పూసపాటి వంశీకుడు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గత కొన్నాళ్ళుగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. తాజా ఎన్నికల ఫలితాలు అశోక్ జీవితంలో ఓ విధంగా కీలకమైనవి. గౌరవంగా తప్పుకుందా మనుకున్న ఆయనకు తీరని అవమానాన్ని మిగిల్చాయి. ఎంపీ సీటుకు పోటీ పడిన వైసీపీ నేత బెల్లాల చంద్రశేఖర్ చేతిలో దారుణంగా పరాజయం పాలు అయ్యారు. ఆ తరువాత ఆయన ఎక్కడా కనిపించడంలేదు, వినిపించడంలేదు. ఆ మధ్యన చంద్రబాబు పార్టీ మీటింగు పెడితే వెళ్లారు. ఆ మీటింగులో బాబు వైఖరిని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. పార్టీని సరిగ్గా పట్టించుకోవడం వల్లనే ఓడిపోయామని ఘాటైన నిజాన్ని వినిపించారు. ఇక ఓ విధంగా అశోక్ రాజకీయ జీవితం ముగిసిందా అన్న చర్చ కూడా ఓ వైపు సాగుతోంది.
రాజు గారి మౌనం ఎందుకో

ఇదిలా ఉండగా అశోక్ గజపతి రాజుకు విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఎంతో విలువ, గౌరవం ఉన్నాయి. ఆయన ఓడిపోయినా ఆ కుటుంబం అంటే ఇప్పటికీ జనంలో ఆదరణ ఉంది.దాంతో ఆయన్ని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పూసపాటి కుటుంబం బ్రాండ్ ఇమేజ్ ని రాజకీయాలకు అనుకూలంగా వాడుకోవాలను కుంటోందంటున్నారు. ఇక మరో విషయమేంటంటే కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు ప్రధాని మోడీకి బాగా ఇష్టుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన్ని అప్పట్లో మోడీ ప్రశంసించిన సందర్బాలు కూడా అనేకం ఉన్నాయి. ఓ విధంగా అప్పట్లోనే రాజు గారు బీజేపీలోకి వెళ్తారని టాక్ నడించింది. అయితే చివరికి తాను టీడీపీలోనే ఉంటానని ఆయన చెప్పడంతో ఆ ప్రచారం ఆగింది.ఇక ఇపుడు ఎటూ టీడీపీ ఓడిపోయింది, అశోక్ గజపతి రాజు సైతం ఆ పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ సమయంలో ఆయన్ని పార్టీలోకి తీసుకువస్తే ఎలా ఉంటుందన్న చర్చ బీజేపీలో సాగుతుందని తెలుస్తోంది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ఆయన కుమార్తెను పార్టీలోకి తీసుకున్నా జిల్లాలో కమలానికి ఒక ఊతం దొరుకుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఇక అశోక్ గజపతి రాజు బీజేపీలో చేరితే ఆయన్ని గవర్నర్ ని చేస్తారని, రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ఇలా రకరకాలుగా ప్రచారం అప్పట్లో సాగింది. ఇపుడు కూడా బీజేపీ అశోక్ గజపతి రాజు మీద ఆశలు వదులుకోవడంలేదు. మరి రాజు గారి మౌనం ఏ రకమైన సంచనలను నమోదు చేస్తుందో చూడాలి.

No comments:

Post a Comment