Breaking News

19/07/2019

రాయపాటి రామ్...రామే...

గుంటూరు, జూలై 19, (way2newstv.in)
రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఆయన 2019 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అని తన సన్నిహితుల వద్ద చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో రాయపాటి 
సాంబశివరావు నరసరావుపేట ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓ‌టమి పాలయ్యారు. రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ గాలి బలంగా వీయడంతో రాయపాటి కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. యువకుడైన లావు శ్రీకృష్ణ దేవరాయలు చేతిలో ఓటమిపాలు కావడం ఆయన .రాయపాటి సాంబశివరావు పొలిటిషియన్ ప్లస్ బిజినెస్ మెన్. ఆయనకు అనేక రకాల వ్యాపారాలున్నాయి. 
పొగాకు సంబందిత వ్యాపారాలతో పాటు కనస్ట్రక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన అధికారంలో ఉండే పార్టీని ఎంచుకుంటారు. రాయపాటి సాంబశివరావు 2014 ఎన్నికలకు ముందు రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. 
రాయపాటి రామ్...రామే...

ఆయన అదృష్టం బాగుండి ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.ఇక 2019 ఎన్నికలకు ముందు రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీని వీడాలని ఒక దశలో ఆలోచన చేశారు. టిక్కెట్ల ఖరారు విషయంలో చంద్రబాబునాయుడు కొంత జాప్యం చేయడంతో రాయపాటి సాంబశివరావు కినుక వహించారు. అలాగే మాచర్ల టిక్కెట్ విషయంలోనూ తన మాటే నెగ్గాలని పట్టుబట్టారు. ఒకదశలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆలోచన చేశారు. అగ్రనేతలతో చర్చలు కూడా జరిపారు. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు.తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్న రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాయపాటి తన రాజకీయ భవిష్యత్ కన్నా తన తనయుడు రాయపాటి రంగారావు రాజకీయ భవిష్యత్తు గురించే ఎక్కువగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లోనూ గెలవడం కష్టమేనని భావించిన రాయపాటి సాంబశివరావు వైసీపీలోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆయన బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్నా తన ప్రధాన ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటంతో కొంత వెనకడుగు వేస్తున్నట్లు కనపడుతోంది. రాయపాటి అయితే పార్టీ మారడం ఖాయం. అది ఏ పార్టీ అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

No comments:

Post a Comment