Breaking News

09/07/2019

రామాతీర్దంనుంచి తాగునీరు సరఫరా


ఒంగోల్, జూలై 09, (way2newstv.in):
జిల్లాలో ప్రజలకు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా రామతీర్థం జలాశయం నుండి నీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం చీమకుర్తి మండలంలోని  రామతీర్ధం జలాశయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ ఇరిగేషన్ ఇంజనీర్లను రామరతీర్ధం జలాశయాన్ని  పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ నీటిని నింపుకోవాడనికి చర్యలు తీసుకోవాలన్నారు. 

రామాతీర్దంనుంచి తాగునీరు సరఫరా

ఇరిగేషన్ శాఖ ఎన్.ఇ. రవి మాట్లాడుతూ నాగార్జున సాగర్ కుడికాలువ చివరి  భుముల వరకు నీరు పారుదల చేయాలంటే కాలువ లైనింగ్ పనులు చేపట్లాలని దానికి సుమారు 330 కొట్లు రూపాయలు అవసరమవుతాయని ఆయన కలెక్టర్ కు వివరించారు. కాలువ లైనింగ్ పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు తయారుచేయాలని కలెక్టర్ ఇరిగేషన్ శాఖ  అధికారులను ఆదేశించారు. కాలువ లైనింగ్ పనులు పుర్తియితే రామతీర్ధం జలాశయానికి  పూర్తి స్థాయిలో నీటిని నింపుకొవచ్చని, ఒంగోలు, కందుకూరు చట్ట ప్రక్కల గ్రామాలకు  త్రాగు నీరు సరఫరా చేయడానికి వీలౌతుందని ఇరిగేషన్ ఎస్.ఇ. రవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్  కలెక్టర్ ఎస్.షన్ మోహన్, ఇరిగేషన్ ఎస్.ఇ.రవి, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎన్.ఇ.సంజీవ రెడ్డి, సంజీవ రెడ్డి, మున్సిపల్ శాఖ ఇ.ఇ.సుందర్ రామి రెడ్డి, ప్రజారోగ్యు శాఖ ఇ.ఇ.రామ్మోహన్, గిరిజన సంక్షేమ శాఖ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment