Breaking News

09/07/2019

మూవీని తలపిస్తున్న కర్నాటకం

బెంగళూరు, జూలై 9 (way2newstv.in):
కర్ణాటక రాజకీయాలు సస్సెండ్ ధ్లిల్లింగ్ మూవీని తలపిస్తున్నాయి.క్షణక్షణానికి రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి.తాజాగా కర్ణాటకలో తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వానికి దూరమవడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆయనతో పాటు మరికొంతమంది బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరింది. ఈ నేపథ్యంలో అసమ్మతి ఎమ్మెల్యేలకు స్పీకర్ రమేష్ కుమార్ నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. అసమ్మతి నేతలను ఇప్పుటికే కాంగ్రెస్, జేడీఎస్ బుజ్జగిస్తున్న విషయం తెలిసిందే.
మూవీని తలపిస్తున్న కర్నాటకం

కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి కారణం భారతీయ జనతా పార్టీయేనని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి అవకవాశం ఇవ్వలేదని, కాంగ్రెస్-జేడీఎస్‌లకు అధికారం కట్టబెట్టారని స్పష్టం చేశారు. ప్రభుత్వాల్ని అస్థిరం చేసి కూల్చడం భారతీయ జనతా పార్టీ అలవాటని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కర్ణాటక గవర్నర్‌కు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఆ లేఖలో రాజీనామా చేసినట్లు చెబుతున్న ఎమ్మెల్యేలు ఎవరూ తనను కలవలేదని పేర్కొన్నారు. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఈరోజు నిర్ణయం తీసుకుంటారని అంత అనుకుంటుండగా స్పీకర్ మరో ట్విస్ట్‌కు తెరలేపారు. తాను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని గవర్నర్‌కు నివేదించారు.

No comments:

Post a Comment