Breaking News

09/07/2019

ఉగ్రరూపంలో అమ్మవారు

వరంగల్, జూలై 09,(way2newstv.in):
శ్రీ  భద్రకాళీ దేవస్థానంలో శాకంభరీ  నవరాత్రులు మంగళవారం  ఏడవ రోజుకు చేరుకున్నాయి.  ఈ రోజు ఉదయం ఐదు గంటలకు  నిత్సాహ్నికం పూర్తిచేసిన పిమ్మట అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని శివదూతీమాత గాను అలంకరించి పూజారాధనలు జరిపారు. ఉగ్ర అమ్మవారు చేతియందు సర్పము. 
ఉగ్రరూపంలో అమ్మవారు

ఢమరుకం, త్రిశూలం, కపాలం ఇత్యాది భయంకరమైన ఆయుధాలను కలిగి దుష్టశక్తుల సంహారం చేసి భద్రకాళి భక్తులను ఎల్లవేళలా కాపాడుతుంది. అట్లాగే జగన్మాత కాళిక రాక్షస సంహారం చేస్తున్న సందర్భంలో రాక్షన సోదరులైన శింభ నిశుంభులకు హితోపదేశం చేయడానికి శివుడిని దూతగా పంపిస్తుంది. అప్పుడు ఆమెకు శివదూతి అన్న  పేరు ప్రసిద్ధమైంది. ఈ శివదూతి అమ్మవారు భక్తుల వ్యవహారములను నక్రమంగా నిర్వహింపచేస్తూ విజయాన్ని కలిగిస్తూ, ముక్తికి  హేతువవుతుందని ఆలయ ప్రధానా ఆర్చకులు  భద్రకాళి శేషు తెలిపారు.

No comments:

Post a Comment