Breaking News

08/07/2019

రెట్టింపైన కూరగాయలు


హైద్రాబాద్, జూలై 8, (way2newstv.in)
వర్షాలు పడక పోవడంతో వాటి ప్రభావం కూరగాయల మీద పడుతోం ది. సామాన్యుడు సాధారణంగా వాడుకునే టమాట ధర నిన్న మొన్నటి దాక రూ. 5 నుంచి 10 వరకు పలికి ఇప్పుడు అమాంతంగా రూ. 35కు చేరుకుంది. అదే విధంగా పచ్చిమిర్చి ధర రూ. 55 వరకు పలుకుతోంది. ఇక బీన్స్, క్యారట్ ధరలు సైతం అదే దారిలో ఇతర కూరగాయలు ధరలు సైతం మండి పోతున్నాయి ఈ విధంగా కూరగాయల ధరలన్నీ రైతు బజార్లలో రూ. 30 నుంచి 50 పలుకుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇదే సమయానికి కూరగాయల ధరలు సామాన్య మానవులకు అందుబాటులోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగానే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని అధికారుల చెబుతున్నారు. 

 రెట్టింపైన కూరగాయలు

వేసవిలో వేసిన పంట మరో 15 రోజుల్లో చేతికి అందుంతుందని, దాంతో ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. జూన్ నెలాఖరు వరకు కూరగాయలను ఉత్తర భారత దేశం నుంచి దిగుబడి చేసుకునే వాళ్ళమని అందుకే ధరలు మండి పోయాయని రైతు బజారు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ,కర్నాటక,చత్తీస్‌ఘడ్,మహారాష్ట్ర,ఆగ్రా తదిర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కూడా కూరగయాల రేట్ల మీద ప్రభావం చూపుతోందని చెబుతున్నారు.నగర జనాభా సుమారు కోటికి చేరింది. ఈ లెక్కన ప్రతి ఒక్కరు 350 గ్రాముల కూరగయాలు ప్రతి రోజు వినియోగించాల్సి ఉంది. ఈ విధంగా 35 లక్షల కిలోల కూరగాయలు నగర ప్రజలకు అవసరం ఉండగా హొల్‌సేల్ మార్కెట్లకు 25 లక్షల కిలోల వరకు కూరగాయలు వస్తున్నాయి. మిగాతావి నేరుగా దుకాణాలకు చేరుతున్నాయి. వేసవి కాలంలో 5 నుంచి 10 లక్షల కిలో వరకు కూరగాయల కొరత నగరంలో ఉంది. గతంతో పోలిస్తే ఆ స్థాయిలో ఇప్పుడు ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. కాని కాని కొన్ని కార్పొరేట్ సంస్థలు మాత్రం పంట దిగుబడులతో సంబంధం లేకుండా ప్రెష్ పేరుతో వినియోగ దారులను నిలువు దోపిడి చేస్తుండటంతో  అవి మరింత భారంగా మారుతున్నాయని చెబుతున్నారు.15 రోజులు క్రితం మెహదీపట్నం రైతు బజార్ ధరలతో పోలిస్తే క్రమే పెరుగుతున్నాయని చెప్పవచ్చు.

No comments:

Post a Comment