Breaking News

08/07/2019

గుట్టుగా కొనసాగుతున్న వ్యాపారం


నల్గొండ, జూలై 08, (way2newstv.in)
ఖలేజా గుట్కా, జోడబైల్ తదితర వాటి విక్రయాలపై ప్రభుత్వం 2011 సంవ త్సరంలో నిషేధించిన గుట్కాల నిషేధం అమలుకు నోచుకోవడం లేదు. పాన్ షాపుల్లో, టీ స్టాల్ లలో, కిరాణ షాపుల్లో వాటి విక్ర యాలు గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో గోదాంలో దాచి ఉంచిన సరుకును నేరుగా తీసుకువచ్చి నిషేధం ముసు గులో వ్యాపారులు వీటిని నాలుగింతల రేటు పెంచి జోరుగా విక్రయి స్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.మారు ఏడు సంవత్సరాల క్రితం గుట్కా అమ్మ కాల పై ప్రభుత్వం నిషేధం విధించింది. పొ గాకు ఉత్పత్తుల వినియోగం వల్ల తలెత్తే ఆనా రోగ్య సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలి గిం చేందుకు విసృత ప్రచారం చేయాలని ప్రభు త్వం సమాచార, పౌర సరఫరా శాఖల అధి కారులను ఆదేశించింది. నగరాల నుంచి పట్టణాల కు,పల్లెలకు జోరుగా గుట్కా సర ఫరా అవు తుంది. ముఖ్యం గా ఇతర రాష్ట్రా ల నుంచి రైళ్ళ ల్లో జిల్లాకు దిగుమతి అవు తున్నట్లు వ్యా పారుల ద్వారా తెలు స్తున్నది. 

గుట్టుగా కొనసాగుతున్న వ్యాపారం

అక్కడ నుంచి డీలర్లు, సబ్ డీల ర్ల ద్వారా పట్ట ణాలకు, పల్లెలకు చేరుతున్నాయి.పొగాకు ఉత్పత్తులకు బానిస లైన వారు వాటిని విడిచి పెట్ట లేక పోతు న్నారు. దీంతో నిషే ధం ముసుగులో కలేజా గుట్కా, పాన్‌పరాగ్,జోడబైల్ తది తర ప్యాకె ట్లను వ్యాపారులు అధిక ధర పెంచి సోమ్ము చేసుకుంటున్నారు. జోడబైల్ ప్రతి ప్యాకెట్ లో 20 పోచ్చులుంటాయి. ప్యాకెట్ ధర రూ. 90 ఉండగా దానిని రిటైల్ మార్కెట్‌లో ఒక్కో పోచ్ రూ.10 ల చొప్పున ప్యాకెట్ రూ.200 లకు విక్రయిస్తున్నారు. కలేజా ఒక్కో ప్యాకెట్‌లో 80 పోచ్చులుంటాయి. దాని ధర రూ.200 కాగా దానిని రిటైల్ మార్కెట్‌లో ఒక్కో పోచ్ రూ.5 ల చొప్పున పుల్ ప్యాకెట్ రూ.400 లకు విక్రయిస్తున్నారు. ఇందేంటి అని అడి గిన కొనుగోలుదారులకు నిషేధం ఉంది కదాదొరకటం లేదు అని సమాధానమిస్తున్నారని పలువురు పేర్కోంటున్నారు. గుట్కా వ్యసనానికి అలవాటు పడిన కొం దరు రోజుకు 10 నుంచి 20 ప్యాకెట్లు వాడుతున్నట్లు తెలు స్తుంది.పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల అధిక శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. గుట్కా నమిలేవారికి బెంజో-ఏ-పైరేన్ అనే రసాయనం కాన్సర్ కారక జన్యులను ప్రేరేపిస్తుందని మనిషిలో ఉండే డిఎన్‌ఏ కూడా వేగంగా దెబ్బతింటుందని వైద్యపరిశోధనలో తేలింది. గుట్కాలో ఉండే విషతుల్యాలు శరీరంలోకి ప్రవేశించి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయని వైద్య నిఫుణులు పేర్కొంటున్నారు. గుట్కాలో ఉండే యుజనాల్ అనే రసాయనం మత్తుని కలిగిస్తుందని అధికంగా తీసుకోవడంతో నాడీ మండలం, మూత్రపిండాలు, కాలేయం తదితర అవయ వాలపై దుష్ప్రభావం చూపు తుందని వైద్య పరిశోధనలో తేలింది. గుట్కా ఉత్పత్తులను ఆసరాదాయకంగా భావిం చి ప్రభుత్వం వాటిపై నిషేధం విధించినా గుట్కా అమ్మకాలను మాత్రం అధికారులు నియంత్రించలేక పోతున్నారు. గత సంవ త్సరం గుట్కా అమ్మకాలు నిర్వహిస్తున్న పలు దుకాణాలపై హాలియా ఎస్‌ఐ సతీష్ కుమార్ దాడులు నిర్వహించి పట్టుకు న్నారు. పట్టుపడిన వారిపై కేసులు నమోదైన సంఘటనలు ఉన్నాయి. అయిన మళ్లీ ఎప్పటిలాగే గుట్టు చప్పుడు లేకుండా జోరుగా గుట్కా విక్రయాలు సాగిస్తున్నా ఇటు పోలీసులు కానీ అటు పౌరశాఖ అధికారుల కానీ దాడులు నిర్వహించడం లేదని పలువురు కోరుతున్నారు.యువకులు, మధ్యవయస్కుల వారే అధికంగా గుట్కా వాడుతున్నట్లు సమాచారం 15 నుండి 45 ఏళ్ళ వయసు వారే వీటికి ఎక్కువగా బానిసలవుతున్నారు.వీటి ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిసినా అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. గుట్కా, జోడబైల్ తదితర ఉత్పత్తులను తీసుకో వడం వల్ల కలిగే అనర్ధాలను సినిమా ధియేటర్‌లలో, టీవిల్లో యాడ్స్ ద్వారా చూపించిన కొనుగోలు మందగించక పోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో కలేజా గుట్కా ,జోడాబైల్ విక్రయి స్తున్న దుకాణాలపై దాడులు నిర్వహించి ప్రాణాంతకమైన గుట్కా అమ్మకాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment