Breaking News

16/07/2019

హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరుతో 300 కోట్లు....

హైద్రాబాద్, జూలై 16, (way2newstv.in
హుస్సేన్ సాగ‌ర్ ను  క్లీన్ చేస్తాం.. నీటినంతా తీసేసి పూడిక తీస్తాం.. మళ్లీ దానిని మంచినీటి చెరువుగా మారుస్తాం. మన పాలకులు చేసిన ప్ర‌క‌టిన ఇది.    అధికారులు మారుతున్నారు, ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయి.. వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి.. అయినా సాగ‌ర్ క్లినింగ్‌పై స్ప‌ష్ట‌త లేదు. ఆస్ట్రీయా మోడ‌ల్ అన్నారు, లెజ‌ర్ క్లీనింగ్ అన్నారు, మ‌రో సారీ గ్లోబ‌ల్ ట్రీట్మెంట్ అన్నారు, ప్రయోగాల పేరుతో కోట్లాది రూపాయలను హుస్సేన్ సాగర్ లో కుమ్మరిస్తున్నారు. సాగర్ ప్రక్షాళన మాత్రం ముందుకు సాగడం లేదు. హుస్సేన్ సాగర్‌ లో మనం మంచి నీటిని చూడగలమా.హుస్సేన్  సాగర్ పూర్తిగా ఖాళీ చేసి శుద్ధి చేస్తామని గ‌త ఐదు క్రితం ప్రకటించింది ప్రభుత్వం. 
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరుతో 300 కోట్లు....

సాగ‌ర్ శుద్ది చేయడానికి ఆస్ట్రియా ప్ర‌తినిధి బృందం సాగ‌ర్ ను  ప‌రిశీలించింది. ఆస్ట్రియాలోని డ్యానుబ్ న‌దిని శుద్ది చేసిన మాదిరిగానే హుస్సేన్ సాగ‌ర్ ను శుద్ది చేయడానికి అవ‌కాశం ఉంద‌న్నారు అధికారులు. దీనిపై ఆస్ట్రియా ప్ర‌తినిధి బృందం ఎలాంటి రిపోర్టు ఇవ్వ‌లేదు. ఇక కెనడాకు చెందిన ఓ స్వచ్చంధం సంస్థ సోలార్ సిష్ట‌మ్ ద్వారా సాగర్ నీటిని శుద్ది చేస్తామని ఓ పెద్ద ప్ర‌యోగ‌మే చేసింది. అయితే అప్ప‌ట్లో కొద్దిగా మార్పు వచ్చింద‌ని అధికారులు చెప్పినా ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గోంగ‌డి అక్క‌డే అన్న‌చందంగా ఉంది.  ఇక మేయింటేనేన్స్ పేరుతో నెల‌కు పన్నెండున్నర ల‌క్ష‌ల రూపాయాలు ఖ‌ర్చుచేస్తుంది హెచ్ఎండిఏ. కానీ ప‌రిస్థితుల్లో మాత్రం మార్పు లేదు. సాగర్ ప్రక్షాళనకు ప్రభుత్వం గతంలో జపాన్ నుంచి 360 కోట్ల అప్పులు తీసుకువచ్చింది ఇప్పటికే ఈ నిధుల్లో దాదాపుగా మూడు వంతులు హెచ్ఎండిఏ ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సాగర్ ప్రక్షాళనకు వంద కోట్లకు పైగా నిధులను కేటాయించింది. నిధులన్ని నీళ్ల ఖర్చవుతున్నా సాగర్ ప్రక్షాళన మాత్రం ముందుకు సాగడం లేదు. కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్ల అధికారుల జేబులు నిండుతున్నాయి తప్ప సాగర్ కంపు మాత్రం పోవడం లేదు.సాగ‌ర్‌ను శుద్ది చెయ్యాలంటే ముందుగా సాగ‌ర్‌లోకి వ‌చ్చే మురుగును అపాలి, అనంతరం అందులోని పూడిక, వ్య‌ర్థాలు తొలగించాలి. హుస్సేన్ సాగర్ లోకి నాలుగు ప్రాధాన కాల్వల నుండి మురుగునీరు సారగ్‌లో కలుస్తోంది. బల్కపూర్ నాల, బంజారానాలా, పికేట్ నాల నుండి సివరేజ్ వాటర్ సాగ‌ర్‌లోకి వ‌స్తుండ‌గా.. కుకట్ పల్లి నాల నుండి పారిశ్రామిక వ్యర్థ జలాలు, కెమికల్ వ్య‌ర్థాలు సాగర్ లోకి నిత్యం చేరుతుంటాయి. దీంతో హుస్సేన్ సాగ‌ర్ పూర్తి స్థాయిలో విషతుల్యం అయ్యింది. రోజూ 450 నుండి 500 ఎంఎల్‌డీల సివరేజ్ వ్యర్దాలు హుస్సేన్‌సాగర్‌లో కలుస్తున్నాయి. వీటిలో కుక‌ట్ ప‌ల్లి నాలా నుండి వ‌చ్చే ర‌సాయ‌న వ‌ర్థాలు దాదాపు 350 ఎంఎల్‌డి ఉంటాయంటున్నారు అధికారులు. దీంతో సాగ‌ర్ లోని నీరు ఇలా పూర్తిగా ర‌సాయ‌న వ‌్యర్థాల రూపంలోకి మారిపోయింది. దీంతో సాగ‌ర్లో జ‌ల‌చ‌రాలు బ్ర‌త‌క‌లేని ప‌రిస్థితికి వచ్చాయి. సాగ‌ర్ లో క‌లుస్తున్న సివ‌రేజ్ వ్య‌ర్థాల‌ను కొన్ని ప్రాంతాల్లో శుద్ది చేసి సాగ‌ర్ లోకి వ‌దులుతున్నారు. కానీ కుక‌ట్ ప‌ల్లి, జీడిమెట్ల ప్రాంతాల‌ నుండి వ‌చ్చే పారిశ్రామిక విష వ్య‌ర్థాలు మాత్రం నేరుగా సాగ‌ర్ లోకి వ‌చ్చి చేరుతున్నాయి. దీంతో ఆ వ్య‌ర్థాల‌ను సాగ‌ర్ లోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక పైపులైన్ ఎర్పాటు చేసి సాగ‌ర్ స‌ర్ ప్ల‌స్ నాలాలోకి నీటిని వ‌దిలారు అధికారులు. రెండు కిలో మీటర్ల 850 మీటర్ల పైపులైన్ నిర్మాణాన్ని 59 కోట్లు ఖ‌ర్చు చేసి నిర్మించింది ప్రభుత్వం. అయితే పూర్తి స్థాయిలో వ్య‌ర్థ‌జ‌లాలు మ‌ళ్లించ లేదు. దీంతో సాగ‌ర్ లోకి వ‌్యర్థాలు వ‌చ్చి చేరుతున్నాయి. ఇప్పుడు మ‌రో నాలుగు కోట్ల‌తో ప్ర‌త్యేకంగా వ‌ర్థాల‌ను పూర్తిగా మళ్లించడానికి ప్ర‌త్యేక ప‌నులు చేపడుతున్నారు. ఇలా హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న మూడ‌డుగులు ముందుకు రెండ‌డ‌గులు వెన‌క్కి అన్న చందంగా త‌యారైందనే విమ‌ర్శ‌లున్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు సాగ‌ర్ క్లినింగ్ పేరుతో 300 కోట్లుకు పైగా ఖ‌ర్చు అయ్యాయి.  నూత‌నంగా మ‌రో 8 కోట్ల‌తో మూడు అదునాత‌న యంత్రాల‌ను డిప్లై చేసింది హెచ్ఎండిఎ. వాటితో సాగ‌ర్లో చేరే వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన అన్ని ప‌నులు చెయ్యాలి. కానీ సాగర్ లో ప‌రిస్థితి చూస్తుంటే మాత్రం అలాంటి ధాఖాలాలు క‌నిపించ‌డం లేదు. ఇక న‌క్లెస్ రోడ్డు స‌మీపంలో ఏర్పాటు చేసిన సీవ‌రేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ గ‌త అక్టోబ‌ర్ నుండి ప‌ని చేయడం లేదు. దీంతో ప్ర‌తి రోజు 100 మీలియ‌న్ లీట‌ర్ల మురుగు హుస్సేన్ సాగ‌ర్లో క‌లుస్తుంది. ఇలా సాగ‌ర్ శుద్ది మాత్రం న‌త్త‌ను త‌లిపిస్తుంది. 2006లో చేపట్టిన హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళన పదేళ్ల‌లో పూర్తి కావాలి. కానీ ఎప్పుడు పూర్త‌వుతుందో చెప్ప‌డం సాధ్యం కాదంటున్నాయి అధికార వర్గాలు. అయితే ఇప్పుడు మ‌రో కొత్త ప్ర‌తిపాద‌నను ముందుకు తెస్తోంది హెచ్ఎండిఎ. సాగ‌ర్ శుద్ది

No comments:

Post a Comment