Breaking News

29/06/2019

తెలంగాణలో లేక్ వ్యూ గెస్ట్ హౌస్


హైద్రాబాద్, జూన్ 29, (way2newstv.in)
హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలు తెలంగాణకు అప్పగింత ప్రక్రియ తుదిదశకు చేరింది. ఇప్పటికే సెక్రటేరియట్ లోని భవనాలతోపాటు పలు భవనాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్టు హౌస్ ను కూడా స్వాధీనం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటికి సంబంధించి రెండు రోజుల్లో ఉత్వర్వులు జారీ కానున్నాయి. దీంతో అతిథుల కోసం గెస్ట్ హౌస్ ను పునరుద్ధరించాలని అధికారులు యోచిస్తున్నారు. హైదరాబాద్ లో జగన్ కు రాజభవనం ఉన్నందున అతను హైదరాబాద్ ను సందర్శించినప్పుడు అక్కడే ఉండనున్నారు. 

తెలంగాణలో లేక్ వ్యూ గెస్ట్ హౌస్

దీంతో లేక్ వ్యూ గెస్టు హౌస్ ను స్వాధీనానికి తెలంగాణ ప్రభుత్వానికి మార్గం సుగుమం అయింది.రాష్ట్ర విభజన అనంతరం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను ఏపీ ప్రభుత్వానికి కేటాయించారు. ఈ భవనాన్ని ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ గా వినియోగించారు. ఏపీకి చెందిన జీఏడీ ఇక్కడి నుంచే కార్యకాలపాలను కొనసాగించింది. అయితే ఏపీ పరిపాలన విజయవాడకు మారిన తరువాత, గెస్ట్ హౌస్ ఖాళీగా ఉంది.లేక్ వ్యూ గెస్ట్ హౌస్ 13 విశాలమైన గదులతో రెండు అంతస్తుల భవనం కలిగివుంది. గెస్ట్ హౌస్ పునరుద్ధరించడానికి, ఫర్నీచర్స్ కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం సుమారు రూ .8 కోట్లు ఖర్చు చేసింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఐదేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే అతిథి గృహాన్ని సందర్శించారు. అతిథి గృహాన్ని చంద్రబాబు సీఎం క్యాంప్ ఆఫీస్ గా వినిగించుకోకపోవడం గమనార్హం. ఏపీ అధికారులు గెస్ట్ హౌస్ ప్రాంగణం మొత్తాన్ని ఖాళీ చేశారని, ఫర్నిచర్ ను అమరావతికి తరలించారని..లేక్ వ్యూ గెస్ట్ హౌస్ స్వాధీనానికి ఉత్తర్వులు జారీ అయిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని సీనియర్ అధికారి తెలిపారు.ఇటీవలే ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. సెక్రటేరియట్ లో ఏపీకి కేటాయించిన భవనాలను సైతం స్వాధీనం చేసుకుంది. ఎర్రమంజిల్ లో తెలంగాణ ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ ను నిర్మించనుంది. అలాగే కొత్త అసెంబ్లీ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పుడున్న అసెంబ్లీ స్థలంలోనే అదే నమూనాలో కొత్త అసెంబ్లీని నిర్మించనున్నారు. 

No comments:

Post a Comment