Breaking News

14/06/2019

అడ్డూ అదుపు లేకుండా దోస్త్ దోపిడీ


హైద్రాబాద్, జూన్ 14, (way2newstv.in)
డిగ్రీ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ తెలంగాణ (దోస్త్‌‌‌‌) కొత్త విధానం తీసుకొచ్చింది. డిగ్రీ కాలేజీలో సీటు కన్ఫర్మేషన్‌‌‌‌ కోసం రూ.వెయ్యి చెల్లించాలని నిబంధన విధించింది. ఫీజురీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ పరిధిలో ఉన్న స్టూడెంట్స్‌‌‌‌ కూడా ఫీజు చెల్లించాలని స్పష్టం చేస్తోంది. దీంతో పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సీటు కన్ఫర్మేషన్‌‌‌‌కు ఈనెల15 వరకే గడవు ఉండటంతో, డబ్బుల్లేక కాలేజీల్లో చేరేందుకు చాలా మంది స్టూడెంట్లు ఇష్టపడటం లేదు. ఈ విధానాన్ని స్టూడెంట్స్‌‌‌‌తో పాటు ప్రైవేటు మేనేజ్మెంట్లూ వ్యతిరేకిస్తుండటం గమనార్హం.రాష్ర్టంలో మొత్తం 1,049 డిగ్రీ కాలేజీలుండగా, తొలివిడతలో 980 కాలేజీల్లో 3,83,514 సీట్లను అధికారులు విద్యార్థులకు అందుబాటులో పెట్టారు. తొలివిడత అడ్మిషన్లలో భాగంగా 1,21,363 మంది ‘దోస్త్‌‌‌‌’ రిజిస్ర్టేషన్‌‌‌‌ చేసుకున్నారు. 


అడ్డూ అదుపు లేకుండా దోస్త్ దోపిడీ
వీరిలో 1,11,429 మంది స్టూడెంట్స్‌‌‌‌ వెబ్‌‌‌‌ ఆప్షన్లు ఇవ్వగా, 1,05,433 మందికి కాలేజీల్లో సీట్లు అలాట్‌‌‌‌ అయ్యాయి. వీరంతా కేటాయించిన కాలేజీల్లో చేరేందుకు ఇష్టపడితే, ఈనెల15లోగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో రిపోర్ట్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారి సీట్లు క్యాన్సిల్ అవుతాయి.ఫేజ్‌‌‌‌లో 1,05,433 మందికి సీట్లు అలాట్‌‌‌‌ అయ్యాయి. వారిలో 17,289 మంది మాత్రమే ఓసీ విద్యార్థులున్నారు. మిగిలిన వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టూడెంట్సే. ఈ ప్రకారం సీట్లు అలాట్‌‌‌‌ అయిన వారిలో మెజార్టీ విద్యార్థులు స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌కు అర్హులు. ప్రైవేటు డిగ్రీ కాలేజీలో సీటు అలాట్‌‌‌‌ కోసం ప్రతి విద్యార్థి రూ.వెయ్యి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో చెల్లించాలి. సర్కారు కాలేజీలో సీటు వచ్చిన స్టూడెంట్స్‌‌‌‌లో స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌కు ఎలిజిబుల్‌‌‌‌ కాని వారు రూ.500 చెల్లించాలి. ప్రైవేటు కాలేజీలో సీటు కోసం ఫీజు కట్టిన వారిలో స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌కు అర్హులైన విద్యార్థులకు రూ.500 రీఫండ్‌‌‌‌ చేస్తామని అధికారులు చెప్తున్నా, దానిపైనా అనుమానాలున్నాయి. ప్రైవేటు మేనేజ్మెంట్లు మాత్రం రీఫండ్‌‌‌‌ చేయవని, తమకే చెందుతాయని చెప్తున్నాయి. అధికారులు ఎప్పటిలోపు తిరిగి విద్యార్థుల ఖాతాల్లో వేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.దోస్త్‌‌‌‌ దరఖాస్తుకు రూ.200 చొప్పున ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా కట్టిన స్టూడెంట్లు, మళ్లీ సీటు కన్ఫర్మేషన్‌‌‌‌కూ డబ్బులు కట్టాలంటే ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో విద్యార్థుల కన్ఫర్మేషన్‌‌‌‌ ఫీజును తామే చెల్లిస్తున్నట్టు ప్రైవేటు యాజమాన్యాలు చెప్తున్నాయి. ఈ విధానాన్ని అవి కూడా వ్యతిరేకిస్తు్న్నాయి. రూ.వెయ్యి నిబంధనను తొలగించాలని ప్రైవేటు డిగ్రీ కాలేజీ మేనేజ్మెంట్లు, స్టూడెంట్స్‌‌‌‌ యూనియన్లు డిమాండ్‌‌‌‌ చేస్తున్నాయి.

No comments:

Post a Comment