Breaking News

19/06/2019

రాష్ట్రాన్ని పారిశ్రామిక మరియు ఐటీ రంగాలలో ముందుకు తీసుకు వెళ్తా


మంత్రి మేకపాటి
అమరావతి, జూన్ 19  (way2newstv.in)
రాష్ట్రంలో  పరిశ్రమలు మరియు ఐటీ రంగాల్లో పురోగతి సాధించి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆశయ సాధనే ధ్యేయంగా పని చేస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ఐటీ శాఖా మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. 


రాష్ట్రాన్ని పారిశ్రామిక మరియు ఐటీ రంగాలలో ముందుకు తీసుకు వెళ్తా
ఈరోజు సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్లో  పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రిఆంధ్రప్రదేశ్  రాష్ట్ర  మౌలిక సదుపాయాల సంస్థ పరిధిలో జరుగు వివిధ అభివృద్ధి పనుల పై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులు, పరిశ్రమలు, ఐటీ శాఖాధికారులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.

No comments:

Post a Comment