Breaking News

19/06/2019

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక


న్యూఢిల్లీ, జూన్ 19, (way2newstv.in)
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ మూజువాణి ఓటు ద్వారా ఎన్నిక ప్రక్రియ చేపట్టగా.. ఎంపీలు బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌‌లు పోడింయ దగ్గరకు తీసుకెళ్లగా.. బిర్లా స్పీకర్‌ స్థానంలో కూర్చొన్నారు. అంతకముందు స్పీకర్‌ పదవికి బిర్లా పేరును ప్రధాన మోదీ ప్రతిపాదించగా.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, గడ్కరీ, అమిత్‌షాతో పాటు పలు పార్టీల ఎంపీలు సమర్థించారు. ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికవ్వడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. బిర్లా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారని.. సామాజిక సేవలో ముందుండే వ్యక్తిగా మంచి పేరుందన్నారు. అందరికీ గర్వకారణమైన వ్యక్తి స్పీకర్‌గా ఎన్నికయ్యారని.. రాజస్థాన్‌ అభివృద్ధిలో ఓం బిర్లాది కీలకపాత్ర అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. 


లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక

బిర్లా 1962 నవంబరు 23న రాజస్థాన్‌లోని కోటాలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీకృష్ణ బిర్లా, శకుంతలా దేవి. ఓం బిర్లా అజ్మీర్‌లోని మహర్షి దయానంద్‌ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో మాస్టర్స్‌ చేశారు. బీజేవైఎంలో వివిధ పదవుల్ని అలంకరించారు. 1987-91లో కోటా జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా.. 1991-97లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1997-2003లో బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఓం బిర్లా 2014లో రాజస్థాన్‌లోని కోట-బుందీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా గెలిచారు. 2019లోనూ రెండోసారి 2.79 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2003లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన బిర్లా.. వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. బిర్లా గతంలో వ్యాపారవేత్తగా ఉన్నారు.. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు సన్నిహితంగా ఉంటూ వచ్చారు.కమలం పువ్వులా ఉండండి : నామా
లోక్‌స‌భ స్పీక‌ర్‌గా ఓం బిర్లా ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ త‌ర్వాత ఎంపీలు స‌భ‌లో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు మాట్లాడుతూ.. ప్ర‌తి ఎంపీని మీ పిల్ల‌లుగా భావించాల‌ని, అంద‌ర్నీ స‌మ‌దృష్టితో చూడాల‌ని నామా అన్నారు. ఆ త‌ర్వాత ఎంఐఎం ఎంపీ అస‌ద్ కూడా మాట్లాడారు . ఎన్నికైన ప్ర‌భుత్వం రాచ‌రిక‌పు ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌హ‌రించ‌కుండా స్పీక‌ర్ చూడాల‌ని అస‌ద్ అన్నారు. స్పీక‌ర్ త‌న ద‌గ్గ‌ర ఉన్న ర‌హ‌స్య అధికారాల‌ను వినియోగించాల‌న్నారు. స్పీక‌ర్ ఓం బిర్లా ప్ర‌జాసేవ‌ల‌ను వైఎస్ఆర్‌సీపీ ఎంపీ శ్రీనివాస్ కొనియాడారు. నీటిలో క‌మ‌లం పువ్వులా స్పీక‌ర్ ఉండాల‌ని డీఎంకే నేత టీఆర్ బాలూ అన్నారు. మీరు బీజేపీకి చెందిన‌వారే అయినా.. క‌మ‌లం పువ్వులా నీటికి అంట‌కుండా ఉండాల‌న్నారు.

No comments:

Post a Comment