Breaking News

19/06/2019

హైద్రాబాద్ లో పెరుగుతున్న రియల్ వెంచర్స్

హైద్రాబాద్, జూన్ 19 (way2newstv.in)

ఒకరికి నష్టం వస్తే, మరొకరికి లాభం అంటే, ఇదేనేమో... గత 20 రోజులుగా అమరావతి పరిస్థితి పాతాళానికి పోతుంటే, హైదరాబాద్ లాభపడటం చూస్తున్నాం.. మొన్నటి దాక అమరావతి అంటే హాట్ కేక్.. కాని, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం అమరావతి పై పంథా తెలియకపోవడంతో తీవ్ర సందిగ్ధం నెలకొంది. గతంలో ఇక్కడ అమరావతిలో గజం రూ.25 వేలు పై వరకు వరకు ధర పలికితే అదే స్థలం ధరలు, ఇప్పుడు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పడిపోయింది. 


హైద్రాబాద్ లో పెరుగుతున్న రియల్ వెంచర్స్
ఇంత తగ్గినా, అమరావతి పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించక పోవటంతో, కొనేవారు కనిపించడం లేదు. మొన్నటి దాక ఎకరం రూ.కోటి నుంచి కోటిన్నర వరకు పలకగా, ప్రస్తుతం ఆ రేట్ తగ్గినప్పటికీ అక్కడ కూడా కొనేవారు లేరు. ఇక, రాజధాని పరిధిలోని తుళ్ళూరు, తాడికొండ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు తదితర మండలాల పరిధిలోని గ్రామాల్లోని రైతుల్లో కూడా ఆందోళన నెలకుంది.అమరావతిలో అనుకూల పరిస్థితులు ఏర్పడితే, ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చనే భావనలో కొంత మంది ఉన్నారు.

No comments:

Post a Comment