Breaking News

14/06/2019

ఆన్ లైన్ లో ఆలయ సేవలు

హైదరాబాద్, జూన్ 14 (way2newstv.in

ఆన్ లైన్ లో ఆలయ సేవలు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా ఆర్జిత సేవలు, దర్శనం, గదుల బుకింగ్, ఇతర సేవలను మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టాప్ ఫోలియో మొబైల్ యాప్   ద్వారా ఆన్లైన్ సేవలు అందనున్నాయి. మొదటి విడతలో  యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర, మహంకాళి, బల్కంపేట్, కర్మాన్ ఘాట్ ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు లభించనున్నాయి. 


ఆన్ లైన్ లో ఆలయ సేవలు
వచ్చే నెల నుండి రెండవ దశలో మరో 6 ప్రధాన ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెస్తామని మంత్రి అన్నారు. 14 ప్రధాన ఆలయాల్లో   బెల్లం లడ్డుల విక్రయాలను కుడా మంత్రి  ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ లో రాష్టంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను విస్తరిస్తాం. భక్తుల కోరిక మేరకకు యాదాద్రిలో బెల్లం లడ్డులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆలయాలకు వెళ్లలేని వారి కోసం ఆన్ లైన్ లొనే పూజ జరిపించుకునే అవకాశం త్వరలోనే కలిపించనున్నాం. దీని కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో  విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మండలి  చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment