Breaking News

14/06/2019

పండుగల బడిబాట కార్యక్రమం


వనపర్తి  జూన్ 14(way2newstv.in)
వనపర్తి జిల్లాలోని ప్రతి మండలంలో. ప్రతి గ్రామంలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని ఆయా పాఠశాల యజమాన్యం వారు పండగలా జరుపుకున్నారు. బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ప్రాథమికోన్నత. ప్రాథమిక పాఠశాలలో ర్యాలీలు నిర్వహిస్తూ చదువు యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను బడికి పంపిస్తూ నిరక్షరాస్యత నిర్మూలనకు తోడ్పడాలని ఆయా పాఠశాలల యజమాన్యం వారు కోరారు. 


పండుగల బడిబాట కార్యక్రమం
అందులో భాగంగానే మండల కేంద్రమైన గోపాల్ పేట లో నీ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు మరియు ప్రధానోపాధ్యాయులు. ఉపాధ్యాయు లు విద్యార్థులతో కలిసి బడిబాట కార్యక్రమం పై ర్యాలీలు నిర్వహించడమే కాకుండా చదువు యొక్క ప్రాముఖ్యత పై  ప్రజలకు వివరించారు. 

No comments:

Post a Comment