Breaking News

28/06/2019

ముంబయిని ముంచెత్తుతున్న వర్షాలు


ఎక్కడి వాహనాలు అక్కడే
ముంబాయి, జూన్28 (way2newstv.in
దేశ ఆర్థిక రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రవాణా సేవలకు అంతరాయం కలిగింది. పలు చోట్ల ట్రాఫిక్ను మళ్లించారు.  జూన్ 29 వరకు ముంబయిలో ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  నగరంలోని ప్రధాన ప్రదేశాలతో పాటు శివారు ప్రాంతాలైన విహార్, జుహు, ములుంద్ల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. 

ముంబయిని ముంచెత్తుతున్న వర్షాలు

మరో కొన్ని గంటల్లో మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్, గ్రేటర్ ముంబయి, రత్నగిరి ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు. మరి కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.  వర్షం కారణంగా ముంబయి విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ముంబయి నుంచి ఎయిర్ పోర్టుకు చేరుకునే ప్రయాణికులకు ఎక్కువ సమయం పడుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విమాన సర్వీసుల  యాజమాన్యాలు తెలిపాయి.

No comments:

Post a Comment