Breaking News

29/06/2019

కళా వెంకట్రావు అడ్డంగా బుక్కయ్యారా...

గుంటూరు, జూన్ 29, (way2newstv.in)

జగన్ దూకుడు కాదు కానీ మాజీ మంత్రులకు బాగా వణుకుపుడుతోంది. ఏపీలో గత అయిదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని వెలికి తీస్తానని జగన్ చెప్పడమే కాదు, మంత్రి వర్గ ఉప సంఘాలు కూడా వేస్తూ పని కానిచ్చేస్తున్నాడు. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ళలో అవకతవకలు భారీగా జరిగాయని జగన్ అంటున్నారు. వాటి మీద నిజాల నిగ్గు తేలుస్తానని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. దీని మీద తాజాగా వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చేయబోతుందన్న చర్చ వాడి వేడిగా సాగుతోంది. చవకగా వచ్చే విద్యుత్ ను యూనిట్ కాస్ట్ మరీ దారుణంగా పెంచేసి ఆ తేడాలో వేల కోట్లను దోచేశారని జగన్ ఆరోపణ. దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిపిస్తామని, బాధ్యుల నుందే ప్రజా ధనాన్ని వెలికి తీస్తామని జగన్ పక్కా క్లారిటీగా చెబుతున్నారు.ఏపీలో చూసుకుంటే విద్యుత్ కొనుగోళ్ళకు సంబంధించి అనేక లావాదేవీలు జరిగాయి. 

కళా వెంకట్రావు అడ్డంగా బుక్కయ్యారా...

ఎన్నో ఒప్పందాలు కూడా జరిగాయి. అయితే ఈ ఒప్పందాల వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు 2017లో విధ్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే టీడీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్ళు గడచిపోయింది. కీలకమైన ఒప్పందాలు అన్నీ కూడా ముందే జరిగాయి. అయితే కళా వెంకటరావు మంత్రిగా ఉన్న కాలంలో అధినేత చంద్రబాబు చెప్పిన విధంగానే చేశారని, ఆయన నిమిత్తమాత్రుడని అంటున్నారు. ఇపుడు విచారణ జరిపి తప్పుంటే శిక్షిస్తామని చెబుతున్న జగన్ సర్కార్ కి మాత్రం అడ్డంగా దొరికేది మాజీ విద్యుత్ శాఖా మంత్రి హోదాలో కిమిడి కళా వెంకటరావేనని ఆయన అనుచరులు దిగులు పడుతున్నారు.అసలే తాజా ఎన్నికల్లో ఘోరంగా పార్టీ ఓడింది. కిమిడి కళా వెంకటరావు కూడా తన ఎచ్చెర్లలో ఓటమి పాలు అయ్యారు. ఇక ఆయన నుంచి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కూడా తీసుకుంటారని అంటున్నారు. ఓ విధంగా కళా వైభవం పూర్తిగా మసకబారిపోయింది. దానికి తోడు అన్నట్లుగా ఈ విచారణలేమిటని ఆయన అనుచర వర్గం కలవరపడుతోంది. తెలుగుదేశం పాలనలో కళా మంత్రిగా చేసింది తక్కువని, ఆయన నిర్ణయాలు ఏవీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో కూడా లేవని, అన్నీ కూడా ప్రభుత్వ స్థాయిలోనే తీసుకుని కిమిడి కళా వెంకటరావు చేత సంతకాలు మాత్రమే చేయించారని అంటున్నారు. ఇపుడు మంత్రి వర్గ ఉప సంఘం నిజాల నిగ్గు తెల్చితే కళా దొరికిపోతారని, తెర వెనక ఒప్పందాలు చేసుకున్న వారు, నాటి ప్రభుత్వ పెద్దలు సేఫ్ జోన్లోకి వెళ్తారని ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా కళాకు ఎంతవరకూ మద్దతుగా నిలబడుతుందన్నది డౌటేనని అంటున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా ఉంటే చాలన్న ధోరణిలోనే పార్టీ పెద్దలు ఎపుడూ ఉంటారని అంటున్నారు. . దీంతో కళా వర్గంలో అలజడి రేగుతోంది

No comments:

Post a Comment