Breaking News

29/06/2019

చంద్రబాబు అవినీతే..లక్ష్యంగా జగన్ అడుగులు


విజయవాడ, జూన్ 29, (way2newstv.in)
ఎందుకో తెలుగుదేశం పార్టీకి కాని కాలం దాపురించింది. తాడు పట్టుకుంటే అది పాము అవుతోంది. అసలు రోజులు బాగాలేవు. లేకపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 23 మంది ఎమ్మెల్యేలు గెలవడం ఏంటి. రాజకీయ వారసుడు లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడం ఏంటి. ముచ్చటగా మూడవసారి కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చోవడమేంటి. తన కొడుకు వయసు ఉన్న జగన్ తో మాటలు పడడం ఏంటి. ఓ వైపు వయసు ముదురుతున్న వేళ సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు జాతకం ఇలా రివర్స్ కావడమేంటి. మొత్తానికి బాబుతో పాటే టీడీపీ సైకిల్ కి పంక్చర్ పడిపోయింది.ఇక ప్రజావేదిక అక్రమ కట్టడం అని విపక్షాలతో పాటు అందరికీ తెలుసు. అందుకే ఎవరూ గట్టిగా జగన్ సర్కార్ ని ఏమీ అనలేని పరిస్థితి. అదే సమయంలో కూలగొట్టొద్దు అంటూ టీడీపీ అంటోంది తప్ప అది అక్రమ కట్టడం కాదు అని చెప్పలేకపోతోంది. దానికి బదులుగా పేలవమైన వాదనలు వినిపిస్తూ ఏపీలో ఎక్కడపడితే అక్కడ అనధికారికంగా వైఎస్సార్ విగ్రహాలు ఉన్నాయి. 

చంద్రబాబు అవినీతే..లక్ష్యంగా జగన్ అడుగులు

ఇంకేవో అక్రమ కట్టడాలు ఉన్నాయని లిస్ట్ చదువుతోంది. అక్కడ తప్పు ఉంటే దాని మీద చర్యలు ఉంటాయి కానీ ప్రజా వేదిక తప్పుల తడక అని తమ్ముళ్ళు చెప్పకనే ఒప్పుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే ఈ ఎపిసోడ్ తో టీడీపీ పరువు పూర్తిగా మంటకల్సిపోయింది. ఒక్క ప్రజా వేదికలోనే కోట్ల అవినీతి జరిగిందని జగన్ సర్కార్ ఆంధ్ర జనాలకు చక్కగా తెలియచేసింది. ఇపుడు తమ్ముళ్ళకు సౌండ్ వస్తే ఒట్టుజగన్ దూకుడు కాదు కానీ మాజీ మంత్రులకు బాగా వణుకుపుడుతోంది. ఏపీలో గత అయిదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని వెలికి తీస్తానని జగన్ చెప్పడమే కాదు, మంత్రి వర్గ ఉప సంఘాలు కూడా వేస్తూ పని కానిచ్చేస్తున్నాడు. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ళలో అవకతవకలు భారీగా జరిగాయని జగన్ అంటున్నారు. వాటి మీద నిజాల నిగ్గు తేలుస్తానని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. దీని మీద తాజాగా వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చేయబోతుందన్న చర్చ వాడి వేడిగా సాగుతోంది. చవకగా వచ్చే విద్యుత్ ను యూనిట్ కాస్ట్ మరీ దారుణంగా పెంచేసి ఆ తేడాలో వేల కోట్లను దోచేశారని జగన్ ఆరోపణ. దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిపిస్తామని, బాధ్యుల నుందే ప్రజా ధనాన్ని వెలికి తీస్తామని జగన్ పక్కా క్లారిటీగా చెబుతున్నారు.ఏపీలో చూసుకుంటే విద్యుత్ కొనుగోళ్ళకు సంబంధించి అనేక లావాదేవీలు జరిగాయి. ఎన్నో ఒప్పందాలు కూడా జరిగాయి. అయితే ఈ ఒప్పందాల వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు 2017లో విధ్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే టీడీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్ళు గడచిపోయింది. కీలకమైన ఒప్పందాలు అన్నీ కూడా ముందే జరిగాయి. అయితే కళా వెంకటరావు మంత్రిగా ఉన్న కాలంలో అధినేత చంద్రబాబు చెప్పిన విధంగానే చేశారని, ఆయన నిమిత్తమాత్రుడని అంటున్నారు. ఇపుడు విచారణ జరిపి తప్పుంటే శిక్షిస్తామని చెబుతున్న జగన్ సర్కార్ కి మాత్రం అడ్డంగా దొరికేది మాజీ విద్యుత్ శాఖా మంత్రి హోదాలో కిమిడి కళా వెంకటరావేనని ఆయన అనుచరులు దిగులు పడుతున్నారు.అసలే తాజా ఎన్నికల్లో ఘోరంగా పార్టీ ఓడింది. కిమిడి కళా వెంకటరావు కూడా తన ఎచ్చెర్లలో ఓటమి పాలు అయ్యారు. ఇక ఆయన నుంచి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కూడా తీసుకుంటారని అంటున్నారు. ఓ విధంగా కళా వైభవం పూర్తిగా మసకబారిపోయింది. దానికి తోడు అన్నట్లుగా ఈ విచారణలేమిటని ఆయన అనుచర వర్గం కలవరపడుతోంది. తెలుగుదేశం పాలనలో కళా మంత్రిగా చేసింది తక్కువని, ఆయన నిర్ణయాలు ఏవీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో కూడా లేవని, అన్నీ కూడా ప్రభుత్వ స్థాయిలోనే తీసుకుని కిమిడి కళా వెంకటరావు చేత సంతకాలు మాత్రమే చేయించారని అంటున్నారు. ఇపుడు మంత్రి వర్గ ఉప సంఘం నిజాల నిగ్గు తెల్చితే కళా దొరికిపోతారని, తెర వెనక ఒప్పందాలు చేసుకున్న వారు, నాటి ప్రభుత్వ పెద్దలు సేఫ్ జోన్లోకి వెళ్తారని ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా కళాకు ఎంతవరకూ మద్దతుగా నిలబడుతుందన్నది డౌటేనని అంటున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా ఉంటే చాలన్న ధోరణిలోనే పార్టీ పెద్దలు ఎపుడూ ఉంటారని అంటున్నారు. . దీంతో కళా వర్గంలో అలజడి రేగుతోంది.ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు పాలనంతా అవినీతిమయం, అక్రమం అని అయిదేళ్ళ పాటు జగన్ వూరూ వాడా వూదరగొట్టారు. అయితే అవి ప్రతిపక్షం చేసే సాధారణ ఆరోపణగానే అంతా చూశారు. అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలను వెలికి తీయాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అయితే అన్ని విషయాలు బయటపడేటప్పటికి చాలా సమయం పడుతుంది. కొన్ని నిరూపించేందుకు ఏళ్ళు వూళ్ళు కూడా దాటిపోవచ్చు. అందుకే జగన్ నెల రోజుల లోపే బాబు భాగోతాన్ని బయట పెట్టేందుకు ఆయన కలల వేదిక ప్రజావేదికనే ఎంచుకున్నారు. దాన్నే నిలువెత్తు సాక్ష్యంగా చేసి చూపించారు. అది అక్రమమని లోకమంతా కళ్ళారా చూసేలా చేసి మరీ కూలగొట్టారు. టీడీపీకి ఈ డ్యామేజి అంతా ఇంతా కాదు.

No comments:

Post a Comment