Breaking News

14/06/2019

ముప్పు ముందుంది (చిత్తూరు)

చిత్తూరు, జూన్ 14(way2newstv.in): 
వరణుడు కరుణించకపోవడంతో భూగర్భజలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. దాంతో తాగునీటి కటకట ఏర్పడుతోంది. వర్షాభావ పరిస్థితుల్లో అటు ప్రజలు, ఇటు పశువులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయి. ప్రకృతి సమతుల్యత లోపించడం భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి మరొక కారణం. సమృద్ధిగా వృక్షాలు లేకపోవడంతో భూమిపై నిల్వ ఉన్న నీరు ఆవిరి రూపంలో పోతోంది. ప్రకృతిలో కాలుష్యం ఎక్కువైనప్పుడు ఓజోన్‌ పొర స్పందించే గుణం కోల్పోయి..ఈ గ్రీన్‌ హౌస్‌ గ్యాసెస్‌ ఏర్పడతాయి. దీనివల్ల భూ తాపం పెరిగిపోతోంది. నీటి లభ్యత తగ్గడం, వివిధ వాయువులు వెలువడి కాలుష్యం పెరుగుతుంది.రహదారులకు ఇరువైపులా ఎంతో సుందరంగా ఉంటూ, వేసవిలోనూ రహదారినంతటినీ నీడతో కప్పి ఉంచే వృక్షాలు నేలమట్టం అయ్యాయి. అభివృద్ధి పేరిట నేల కొరిగాయి. జిల్లాలో చిత్తూరు-పుత్తూరు, చిత్తూరు-కడప, చిత్తూరు-తిరుపతి, బెంగళూరు-చెన్నై హైవే, పలమనేరు-కృష్ణగిరి వరకు ఉన్న రహదారులను ప్రధానంగా విస్తరించారు. ఆయా మార్గాల్లో విస్తరణకు అడ్డుగా ఉన్న వేలాది చెట్లన్నింటినీ తొలగించారు. ప్రత్యామ్నాయంగా కనీసం పది శాతం మొక్కలు పెంచకపోవడం దారుణం. శాస్త్రీయ, పద్ధతుల్లో, ఆధునిక సాంకేతిక విధానాలను వినియోగించి రీప్లాంటేషన్‌ చేయాలి. పర్యావరణాన్ని కాపాడాలి.

ముప్పు ముందుంది (చిత్తూరు)

1:2 నిష్పత్తిలో.. రోడ్డు విస్తరణలో తొలగించిన చెట్లకు బదులుగా మొక్కల పెంపకాన్ని చేపట్టాల్సి ఉంది. 1ః2 నిష్పత్తిలో మొక్కలు కొత్తగా నాటాలి. రహదారికి ఇరువైపులా వీటిని ఏర్పాటుచేయాల్సి ఉంది. వీటి రక్షణకు ట్రీగార్డ్‌లు.. ఐరన్‌ గ్రిల్స్‌ సైతం ఏర్పాటుచేయాలి. జాతీయ రహదారి డివైడర్‌లో సైతం విభిన్న రకాల కొత్తగా ఆలోచిస్తే.. వృథా సద్వినియోగం అవుతుందనేందుకు ప్రత్యక్ష నిదర్శనం పాకాల మండల కేంద్ర పంచాయతీ. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనతికాలంలోనే.. ఈ కేంద్రం ముందుకెళ్తోంది. గ్రామ పంచాయతీ నుంచి సేకరించిన చెత్త ద్వారా ప్రస్తుతం ప్రతి నెలా ఏడు టన్నుల సేంద్రీయ ఎరువును ఉత్పత్తిచేస్తున్నారు. అలాగే కాలుష్యానికి దూరంగా.. పచ్చని వాతావరణంతో చుట్టుపక్కల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతోంది. వ్యర్థాలు పట్టణీకరణ, ఆధునిక జీవన విధానంలో పెరుగుతున్న వస్తు వినియోగం వంటి కారణాలతో వ్యర్థాలు అధికమవుతున్నాయి. ఎక్కువగా ఘన వ్యర్థాలను రీసైక్లింగ్‌(పునర్వినియోగం)కు పంపకుండా డంపింగ్‌ యార్డుల్లో పడేస్తున్నారు. వ్యర్థాలకు అక్కడే నిప్పు అంటిస్తున్నారు. దీంతో నగరాల చుట్టూ కాలుష్యం పెరుగుతోంది. చెత్త నిర్వహణ కేంద్రాలను ఏర్పాటుచేస్తే వీలైనంత వరకూ కాలుష్యం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. గ్రామాల్లో చెత్త నిర్వహణ కేంద్రాలను ఆదర్శంగా తీసుకుంటే ఉత్తమ ఫలితాల్ని అందుకోవచ్చును. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్‌ మొదలయినా కొనసాగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొన్నేళ్లుగా పరిశీలిస్తే ఈసారి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం పర్యావరణ మార్పుగా అభివర్ణించవచ్ఛు మూడేళ్లలో చూసుకుంటే ఈ ఏడాది శీతలీకరణ యంత్రాల అమ్మకాలు 50శాతం పెరిగాయి. వీటి వల్ల వెలువడే వాయువులు పర్యావరణాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. ఏసీలను ఎక్కువగా వినియోగిస్తే కొత్త రకాల జబ్బులు వస్తున్నట్లు వైద్యులు అంటున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాలంటే పచ్చదనమే ప్రత్యామ్నాయ మార్గంగా భావించి.. ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలను పెంచాలి.జిల్లాలో బెంగళూరు-చెన్నై రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. గుడిపాల నుంచి నలగాంపల్లె వరకు ఒక ప్రాజెక్టుగా, నలగాంపల్లె నుంచి గంగవరం వరకు మరో ప్రాజెక్టుగా పనులు నిర్వహిస్తున్నారు. రహదారి పనుల్లో రోడ్లకు ఇరువైపులా వేల సంఖ్యలో చెట్లను తొలగించారు.

No comments:

Post a Comment